భారత్‌లోకి రాబోతున్న కొత్త కార్లు – ఏవి, ఎలా ఉన్నాయో తెలుసుకోండి!
New cars in India April 2025 మార్చి 2025 ముగిసి, ఏప్రిల్ నెల షురూ అయిపోయింది. నెలలు మారుతున్నట్లే ఆటోమొబైల్ రంగంలో కూడా సరికొత్త మార్పులు, కొత్త కార్లు వస్తున్నాయి. ఈ ఏప్రిల్‌లో భారత మార్కెట్లో అడుగుపెట్టడానికి కొన్ని అద్భుతమైన కార్లు సిద్ధంగా ఉన్నాయి. అవేంటి? వాటి స్పెషల్ ఫీచర్స్ ఏమిటి? ధర ఎంత ఉండొచ్చు? అన్న వివరాలను ఈ వార్తా కథనంలో చూద్దాం!
1. ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ – లగ్జరీ అనుభవం (Volkswagen Tiguan R Lin)
భారత్‌లో బాగా పాపులర్ అయిన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ, తన అత్యంత ఖరీదైన కారు టిగువాన్ ఆర్ లైన్ ని ఈ నెల 14న లాంచ్ చేయబోతోంది. ఈ కారు మునుపటి మోడల్ కంటే మరింత స్టైలిష్‌గా, ఆధునికంగా వస్తోంది. 30 మిమీ పొడవు ఎక్కువైన ఈ కారులో కొత్త హెడ్‌లైట్స్, స్పోర్టీ బంపర్స్, 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ లైట్ స్ట్రిప్స్ ఉన్నాయి.
లోపల చూస్తే, 10.3 ఇంచ్ డిజిటల్ డిస్‌ప్లే, 12.9 ఇంచ్ టచ్‌స్క్రీన్, ట్రై-జోన్ లైటింగ్ వంటి లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు 204 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. కేవలం 7.1 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగం పుంజుకుంటుంది. ధర సుమారు రూ. 50 లక్షలు ఉండొచ్చని అంచనా.
Official Link – Volkswagen Tiguan R Lin
2. ఎంజీ సైబర్‌స్టర్ – ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు (MG Cyberster)

ఎంజీ మోటార్ తన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు సైబర్‌స్టర్ని ఈ నెలలో లాంచ్ చేయనుంది. ఈ కారు కొన్ని ప్రీమియం షోరూమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుందట. లంబోర్ఘిని స్టైల్ డోర్స్, 20 ఇంచ్ వీల్స్, బాణం ఆకారపు టెయిల్ ల్యాంప్స్‌తో ఈ కారు అదిరిపోతుంది.
77 కిలోవాట్ బ్యాటరీతో వచ్చే ఈ కారు 510 హార్స్ పవర్, 725 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. కేవలం 3.2 సెకన్లలో 100 కిమీ వేగం అందుకుంటుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. లాంచ్ డేట్ ఇంకా క్లారిటీ రాలేదు కానీ, ఈ నెలలోనే అమ్మకాలు స్టార్ట్ అవుతాయని కంపెనీ చెప్పింది.
Official Link – MG Cyberster
3. కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ – కొత్త లుక్‌తో రీఎంట్రీ (Kia Carens Facelift)
ఇప్పటికే హిట్ అయిన కియా కారెన్స్, ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో ఈ నెలలో మళ్లీ మార్కెట్లోకి వస్తోంది. కొత్త డిజైన్, ఎల్ఈడీ లైట్ బార్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్‌తో ఈ కారు సిద్ధమవుతోంది.
ఇంజిన్ ఆప్షన్స్‌లో 1.5 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్, టర్బో డీజిల్ ఉన్నాయి. మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ రెండూ అందుబాటులో ఉంటాయి. ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు కానీ, కొత్త లుక్‌తో ఈ కారు అభిమానులను ఆకట్టుకోవడం ఖాయం.
4. స్కోడా కొడియాక్ – గ్లోబల్ స్టైల్‌లో (Skoda Kodiaq)
స్కోడా నుంచి కొడియాక్ కూడా ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానుంది. కొత్త గ్రిల్, అప్డేటెడ్ బంపర్, 13 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో ఈ కారు రానుంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 190 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. గ్లోబల్ మోడల్‌లా స్టైలిష్‌గా ఉంటుంది.
5. టాటా కర్వ్ డార్క్ ఎడిషన్ – బ్లాక్ బ్యూటీ (Tata Curve Dark Edition )
టాటా మోటార్స్ నుంచి కర్వ్ డార్క్ ఎడిషన్ ఈ నెలలో వస్తోంది. పూర్తిగా బ్లాక్ కలర్‌లో డిజైన్ చేసిన ఈ కారు, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌లతో రానుంది. ధర స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 40,000 ఎక్కువ ఉండొచ్చు.
6. సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ – స్టైల్‌తో ఎంట్రీ (Citroen Basalt Dark Edition)
ఏప్రిల్ 2025లో భారత కార్ల మార్కెట్ సందడిగా ఉండబోతోంది. లగ్జరీ నుంచి ఎలక్ట్రిక్, స్టైలిష్ డార్క్ ఎడిషన్స్ వరకు అన్నీ రాబోతున్నాయి. మీకు ఏ కారు ఇష్టమైందో కామెంట్‌లో చెప్పండి!