Matka: బాబాయ్ డిప్యూటీ సీఎం అయినా.. అబ్బాయ్ సినిమాకు కలెక్షన్లు నిల్?

Matka : ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఊపిరి వచ్చినట్టు అయింది. గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల రేట్లు దారుణంగా తగ్గించడమే కాకుండా బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఉండేది కాదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా సినీ నటుడు డిప్యూటీ సీఎం గా మారడంతో సినిమా కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈయన సినిమా టికెట్ల రేట్లను పెంచడానికి అనుమతి తెలిపారు.

ఇలా సినిమా టికెట్లు రేట్లు పెంచడంతో నిర్మాతలు కూడా మంచి లాభాలను అందుకుంటున్నారు అలాగే అదనపు షోలకు కూడా రెండు ప్రభుత్వాలు అనుమతి తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల మట్కా (Matka) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజుల వ్యవధిలోనే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ సినిమా విడుదలైన రెండు రోజులకు గాను కేవలం రెండు కోట్ల రూపాయల కలెక్షన్స్ మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : Chandra Babu : జైలులో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అదే… విజయానికి నాంది అదే

Matka

ఇక సినిమా ఎంపిక విషయంలో వరుణ్ తేజ్ ఇటీవల తడబడుతున్నారని అందుకే ఈయనని వరుస ఫ్లాపులు వెంటాడుతున్నాయని తెలుస్తుంది. సరికొత్త కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులను థ్రిల్ చేయాలన్న ఉద్దేశంలోనే ఈయన కథల విషయంలో తడబాటు కారణంగా వరుస ఫ్లాప్స్ వెంటాడుతున్నాయి. లేకపోతే ఈయన కూడా మెగా కుటుంబంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందే వారని పలువురు భావిస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఈయన సినిమాకి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా కలెక్షన్ల పై ప్రభావం చూపకపోవడంతో కథలో దమ్ము లేదని తెలుస్తోంది. ఈ సినిమాకు రెండు రోజులలో కేవలం రెండు కోట్లు మాత్రమే వసూలు అయినట్టు తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా ప్రమోషన్ల కోసం పెట్టిన ఖర్చులలో సగం కూడా రాలేదని పలువురు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ల కోసం అలాగే ప్రీ రిలీజ్ వేడుకల కోసం మేకర్స్ ఏకంగా ఐదు కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. కానీ ఈ సినిమా కలెక్షన్లు మాత్రం ఈ ఖర్చులో సగం కూడా రాలేదని తెలుస్తోంది.ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 25 కోట్ల రూపాయలకు జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 23 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమా టార్గెట్ భారీగానే ఉందని చెప్పాలి.

Share This Article
Exit mobile version