Nara Ramamurthy Naidu : ఏపీ సీఎం సోదరుడు కన్నుమూత… హుటాహుటిన హైదరాబాద్ వెళ్లిన లోకేష్!

Nara Ramamurthy Naidu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు (Nara Ramamurthy Naidu)గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. అయితే ఈయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్ను మూసారు. దీంతో హుటాహుటిన మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ వెళ్ళినట్టు సమాచారం. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన హైదరాబాద్లోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి మరణించారని విషయం తెలియగానే లోకేష్ అసెంబ్లీ నుంచి తన కార్యకలాపాలన్నింటినీ కూడా రద్దుచేసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. నారా రామ్మూర్తినాయుడు 1952లో నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతులకు రెండో సంతానం. ఇక రామ్మూర్తి నాయుడుకి కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు.

Also Read : Chandra Babu : జైలులో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అదే… విజయానికి నాంది అదే

ఇక వీరిలో ఒకరు హీరో నారా రోహిత్ అనే విషయం మనకు తెలిసిందే . మరొకరు నారా గిరీష్… చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కూడా గతంలో రాజకీయాలలోకి వచ్చారు. ఈయన 1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినటువంటి రామ్మూర్తి నాయుడు కొంతకాలం తర్వాత తన అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన పరిస్థితి విషమంగా మారి కన్నుమూశారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న నారా లోకేష్ అసెంబ్లీ నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా నేడు తన షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు. మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున ఈయన కూడా మహారాష్ట్రలో పర్యటించాల్సి ఉంది కాకపోతే తన తమ్ముడి మరణంతో ఈయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాదు రానున్నట్టు తెలుస్తుంది.

Share This Article
Exit mobile version