Rakul: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి రకుల్ ప్రీతి సింగ్. మొదటి సినిమానే మంచి సక్సెస్ కావడంతో ఈమెకు అనంతరం తెలుగులో అలాగే తమిళంలో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన ఈమె నటించారు. ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇక తెలుగులో ఈమె కొండ పొలం అనే సినిమా ద్వారా చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇలా తెలుగులో ఈమెకు అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా రకుల్ యూట్యూబర్ రణ్వీర్ అలహబాడియా ఇంటర్వ్యూలో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ నాకు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో నటించే అవకాశం రెండుసార్లు వచ్చింది కానీ వచ్చిన అవకాశాలు వచ్చినట్టే చేజారిపోయాయని తెలిపారు. ఓ సినిమాకు నేను కమిట్ అయ్యి నాలుగు రోజులపాటు షూటింగ్లో కూడా పాల్గొన్నాను. అయితే నాకు తెలియకుండా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నా స్థానంలో మరొకరిని తీసుకున్నారని తెలిపారు.
Also Read : Prabhas: రాజు కాదు.. మారాజు.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించిన ప్రభాస్
ఇక మరో సినిమాకు సైన్ చేశాను షూటింగ్ ప్రారంభం కాకముందే నన్ను తొలగించారని ఈమె తెలియజేశారు. ఒకవేళ ప్రభాస్ సినిమాలో కనుక నేను నటించి ఉంటే నా మొదటి సినిమా ప్రభాస్ తోనే అయి ఉండేదని ఈమె తెలిపారు. ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని ఆనందపడేలోపు నన్ను తీసేసారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు నాకు నటన రాదని తొలగించారా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడంతో నన్ను తొలగించారా తెలియదు కానీ ఈ రెండు సినిమాల నుంచి నన్ను తొలగించారు. ఇండస్ట్రీ గురించి మనకు పూర్తిగా తెలియనప్పుడు ఇలాంటివి జరిగిన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.. అయితే ప్రభాస్ తో నటించే ఛాన్స్ వచ్చిన ఆ రెండు సినిమా పేర్లను మాత్రం ఈమె వెల్లడించలేదు.