Prabhas: రాజు కాదు.. మారాజు.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించిన ప్రభాస్

తెలుగు ప్రజల కష్టాలు వర్ణనాతీతం. తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. వీరికి మద్దతుగా రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు కూడా ముందుకు వస్తున్నారు.

2 Min Read

Prabhas : దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. మొన్న కేరళ రాష్ట్రాన్ని వణికించిన భారీ వరదలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వరదల కారణంగా చాలా గ్రామాలు నీట మునిగాయి.

అనేక వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగు ప్రజల కష్టాలు వర్ణనాతీతం. తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. వీరికి మద్దతుగా రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ముందుకొచ్చి విరాళాలు అందించారు. తాజాగా, ప్రభాస్ తన మంచి మనసును చూపించి భారీ విరాళాన్ని ప్రకటించాడు.

తెలుగు రాష్ట్రాలకి సాయంగా నిలిచిన తెలుగు సినిమా

ఇప్పటికే చాలా మంది స్టార్స్ ముందుకు వస్తున్నారు. పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళం ప్రకటించారు. మొత్తం రూ. 5 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం 5 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ వార్త విన్న ఆయన అభిమానులు ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన రూ.50 చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటు తెలంగాణ, ఇటు ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు వరదలతో అతలాకుతలం అవుతుండగా.. వరద పరిస్థితి చూసి అందరూ ఉలిక్కిపడ్డారు.

తినడానికి తిండి, తాగడానికి మంచి నీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అశ్విని దత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్ ఒక్కొక్కరు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు.

TAGGED:
Share This Article