ఇన్‌స్టాలో అత్యంత ఇష్టపడే బ్యూటీ ఫిల్టర్‌ల విషయంపై మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ ఏఆర్ ఫిల్టర్లకు స్వస్త పలుకుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు జనవరి 2025 నుంచి తమ యాప్స్‌లో ఈ బ్యూటీ ఫిల్టర్లు అందుబాటులో ఉండవని ప్రకటించింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో యూజర్లు క్రియేట్ చేసిన 20 లక్షలకు పైగా ఫిల్టర్లు కనుమరుగు కానున్నాయి. ఇటీవల ఇన్‌స్టా టీన్ అకౌంట్స్ ప్రకటించిన మెటా బ్యూటీ పిల్టర్‌లపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా బ్యూటీ ఫిల్టర్లకు గుడ్ బై చెప్పడం వెనుక కారణాలను తెలుసుకుందాం.
- ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రధాన ఫీచర్లలో ఈ బ్యూటీ ఫీచర్లు బాగా ప్రాచుర్యం పొందాయి.
- ప్రజలు తమ రూపాన్ని మెరుగుపరచుకోవడానికి వాటిని ఉపయోగిస్తారు.
- వినియోగదారులు Meta Spark Studioని ఉపయోగించి ఈ బ్యూటీ ఫిల్టర్లను క్రియేట్ చేస్తున్నారు.
- అయితే ఈ బ్యూటీ ఫిల్టర్లు యువతుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని గుర్తించిన మెటా వాటికి స్వస్తి పలకాలని నిర్ణయించింది.
- కానీ మెటా తాజా నిర్ణయంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లుండి అన్ని ఫిల్టర్‌లు అదృశ్యం కావు.
- Meta అందించే మొదటి పార్టీ ఫిల్టర్‌లు యథావిధిగా కొనసాగుతాయి.
- కానీ థర్డ్ పార్టీ ఫిల్టర్లతో పోలిస్తే వీటి సంఖ్య చాలా తక్కువ. దాదాపు 140 ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి.
- ఈ ఫస్ట్-పార్టీ ఫిల్టర్‌లు Instagramతో పాటు ఇతర యాప్‌లలో కూడా కొనసాగుతాయి.
- వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తులపై దృష్టి సారించే మెటా వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
- యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు జనవరి వరకు ఈ ఫిల్టర్‌లను ఉపయోగించవచ్చు.
ఇన్‌స్టా టీన్ ఖాతాలు: ఇటీవల మెటా 18 ఏళ్లలోపు వారి కోసం కొత్త ఇన్‌స్టా టీన్ ఖాతాలను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లల ఇన్‌స్టా ఖాతాలు వారి తల్లిదండ్రుల నియంత్రణలో ఉంటాయి. పిల్లలకు కూడా ఇన్‌స్టాను సురక్షిత వేదికగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా తెలిపింది.