మెటా మరో సంచలన నిర్ణయం- ఇన్‌స్టాలో బ్యూటీ ఫిల్టర్లకు గుడ్​బై!

2 Min Read

ఇన్‌స్టాలో అత్యంత ఇష్టపడే బ్యూటీ ఫిల్టర్‌ల విషయంపై మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ ఏఆర్ ఫిల్టర్లకు స్వస్త పలుకుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు జనవరి 2025 నుంచి తమ యాప్స్‌లో ఈ బ్యూటీ ఫిల్టర్లు అందుబాటులో ఉండవని ప్రకటించింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో యూజర్లు క్రియేట్ చేసిన 20 లక్షలకు పైగా ఫిల్టర్లు కనుమరుగు కానున్నాయి. ఇటీవల ఇన్‌స్టా టీన్ అకౌంట్స్ ప్రకటించిన మెటా బ్యూటీ పిల్టర్‌లపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా బ్యూటీ ఫిల్టర్లకు గుడ్ బై చెప్పడం వెనుక కారణాలను తెలుసుకుందాం.

  • ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రధాన ఫీచర్లలో ఈ బ్యూటీ ఫీచర్లు బాగా ప్రాచుర్యం పొందాయి.
  • ప్రజలు తమ రూపాన్ని మెరుగుపరచుకోవడానికి వాటిని ఉపయోగిస్తారు.
  • వినియోగదారులు Meta Spark Studioని ఉపయోగించి ఈ బ్యూటీ ఫిల్టర్లను క్రియేట్ చేస్తున్నారు.
  • అయితే ఈ బ్యూటీ ఫిల్టర్లు యువతుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని గుర్తించిన మెటా వాటికి స్వస్తి పలకాలని నిర్ణయించింది.
  • కానీ మెటా తాజా నిర్ణయంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లుండి అన్ని ఫిల్టర్‌లు అదృశ్యం కావు.
  • Meta అందించే మొదటి పార్టీ ఫిల్టర్‌లు యథావిధిగా కొనసాగుతాయి.
  • కానీ థర్డ్ పార్టీ ఫిల్టర్లతో పోలిస్తే వీటి సంఖ్య చాలా తక్కువ. దాదాపు 140 ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఈ ఫస్ట్-పార్టీ ఫిల్టర్‌లు Instagramతో పాటు ఇతర యాప్‌లలో కూడా కొనసాగుతాయి.
  • వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తులపై దృష్టి సారించే మెటా వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
  • యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు జనవరి వరకు ఈ ఫిల్టర్‌లను ఉపయోగించవచ్చు.

ఇన్‌స్టా టీన్ ఖాతాలు: ఇటీవల మెటా 18 ఏళ్లలోపు వారి కోసం కొత్త ఇన్‌స్టా టీన్ ఖాతాలను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లల ఇన్‌స్టా ఖాతాలు వారి తల్లిదండ్రుల నియంత్రణలో ఉంటాయి. పిల్లలకు కూడా ఇన్‌స్టాను సురక్షిత వేదికగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా తెలిపింది.

Share This Article
Exit mobile version