Hanu Raghavapudi: తనతో పని చేస్తానని కలలో కూడా ఊహించలేదు.. ప్రభాస్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

2 Min Read

Hanu Raghavapudi : అందాల రాక్షసి సినిమా ద్వారా డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు దర్శకుడు హను రాఘవ పూడి. ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక చివరిగా సీతారామం అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత హనురాగవపూడి ప్రభాస్ తో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) ఈటీవీ నిర్వహించిన ఈ ఉచ్చ్వాసం కవనం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన కెరీర్ గురించి పలు విషయాలను వెల్లడించారు. చిన్నప్పుడు తన ఇంట్లో సినిమాలు చూడటానికి ఏమాత్రం అనుమతి ఉండేది కాదని తెలిపారు.

ఇలా ఇంట్లో సినిమాలు చూడనివ్వకపోవడంతో ఇంట్లో వారికి తెలియకుండా సినిమాలు చూసేవాడినని ఈయన తెలిపారు. నేను చూసిన స్వాతి కిరణం శంకరాభరణం సిరివెన్నెల సినిమాలు చూసి ఆశ్చర్యపోయానని, ఈ సినిమాలు చూసిన తర్వాత వరుసగా సినిమాలు మీద ఆసక్తి కూడా పెరిగిందని తెలిపారు. అయితే సినిమాలపై ఆసక్తి పెరగడానికి కారణం ఇందులో ఉన్నటువంటి పాటలే కారణమని తెలిపారు.

Also Read : Prabhas: రాజు కాదు.. మారాజు.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించిన ప్రభాస్

hanu raghavapudi comments

ఈ పాటలన్నీ కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసారని తెలిసి ఆయనకు అభిమానిగా మారిపోయాను. ఇక పీజీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేయడం నావల్ల కాలేదు అందుకే సినిమాలలోకి వచ్చానని తెలిపారు. అలా సినిమాలలో పనిచేస్తున్న సమయంలో సిరివెన్నెల గారితో కలిసి నేను పని చేస్తానని ఎప్పుడూ కూడా అనుకోలేదు.

ఇక దర్శకుడిగా మారిన తర్వాత అందాల రాక్షసి సినిమా కోసం పాటలు కావాలని ఆయనని సంప్రదించాము. కానీ సిరివెన్నెల గారు మాత్రం నా కోసం ఎదురు చూస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పడంతో ఇతర రచయితలతో పాటలు రాయించామని తెలిపారు. ఇక ఇటీవల సీతారామం సినిమా కోసం ఈయన రెండు పాటలు రాశారని హను రాఘవపూడి(hanu raghavapudi) గుర్తు చేసుకున్నారు.

ఈ సినిమాలో రానున్న కళ్యాణం అనే పాట సిరివెన్నెల గారు రాసినదేనని తెలిపారు. ఇందులో కొన్ని లైన్స్ కనుక చూస్తే ఆయన కోసమే ఈ పదాలను రాసుకున్నారా అని ఆశ్చర్యం కలుగుతుందని, ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా తన పాటల రూపంలో ప్రతి ఒక్కరి మనసులోనూ ఉన్నారని సిరివెన్నెల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. సీతారామం కథ చెప్పిన తర్వాత సిరివెన్నెల గారికి ఈ సినిమాలో.. కురుక్షేత్రంలో రావణ సంహారం.. యుద్ధపు వెలుగులలో సీత స్వయంవరం అనే డైలాగ్ చాలా బాగా నచ్చిందని తెలిపారు. ఈ కథ విన్న తర్వాత ఆయన నాతో ఎప్పుడు మాట్లాడిన రావణా అంటూ మాట్లాడేవారని సిరివెన్నెలను గుర్తు చేసుకున్నారు.

Share This Article