Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హరిహర వీరుమల్లు రిలీజ్ డేట్ లాక్!

2 Min Read

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఒకరు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తన నటనతో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకొని ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈయన నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ అభిమానులు మాత్రం భారీ స్థాయిలో ఉన్నారని చెప్పాలి.

ఈ విధంగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల వైపు కూడా అడుగులు వేశారు గత పది సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించిన ఈయన ఎన్నో అవమానాలను ఎదుర్కొంటు రాజకీయాలలో కూడా మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలను తీసుకున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ మరోవైపు గతంలో కమిట్ అయిన సినిమాల షూటింగ్లలో కూడా పాల్గొనడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Pawan Kalyan

Hari Hara Veera Mallu Release Date Announced

ఈయన గతంలో హరిహర వీరుమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి సినిమాలకు కమిట్ అయ్యారు. ఈ సినిమాలన్నీ కూడా కొంత భాగం షూటింగు పూర్తి చేసుకున్నాయి. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస షూటింగ్లలో పాల్గొంటూ ఈ సినిమాలన్నింటినీ పూర్తి చేస్తానని దర్శక నిర్మాతలకు వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి నిర్మాతలు ఒక బిగ్ అప్డేట్ విడుదల చేశారు.

Hari Hara Veera Mallu

Also Read : https://teluguvaradhi.com/ntr-to-act-in-triple-role-for-devara-movie/

పవన్ కళ్యాణ్ ముందుగా ఈ సినిమా షూటింగ్లోనే పాల్గొని ఈ సినిమాని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన సెట్స్ అన్ని కూడా పూర్తి చేసినట్టు సమాచారం. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ గురించి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ విడుదల చేశారు.వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా 2025 మార్చి 28న హరిహర వీరమల్లుని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లుగా మెగా సూర్య ప్రొడక్షన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

TAGGED:
Share This Article