3 లక్షల భారతీయ విద్యార్థులకు అమెరికా కొత్త బిల్లు షాక్
Indian Students USA : అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఇప్పటివరకు అక్రమంగా వలస వచ్చిన వాళ్లను భయపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు సక్రమంగా వచ్చిన విద్యార్థుల జీవితాలను కూడా కలవరపెడుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసిన వాళ్లకు ఇచ్చే ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) అనే అవకాశాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీని కోసం అమెరికా పార్లమెంట్‌లో ఒక కొత్త బిల్లును కూడా పెట్టారు.
ఈ బిల్లు అమల్లోకి వస్తే, అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (STEM) వంటి కోర్సులు చదివిన విదేశీ విద్యార్థులు చదువు ముగిసిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఈ నిర్ణయం F1, M1 వీసాలతో ఉన్న విద్యార్థులపై పడుతుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న సుమారు 3 లక్షల మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. ఈ బిల్లు అమలైతే, వాళ్లు చదువు ముగిసిన తర్వాత అమెరికా వదిలి రావాలి, లేకపోతే అక్రమ వలసదారులుగా గుర్తించి బలవంతంగా దేశం నుంచి తీసేస్తారు.
ఈ కొత్త బిల్లు ఏం చెబుతోంది?
అమెరికాలో మాస్టర్స్ చదివిన విద్యార్థులకు ఇప్పటివరకు ఓపీటీ అనే అవకాశం ఉండేది. ఈ ఓపీటీ వల్ల చదువు ముగిసిన తర్వాత కొంత కాలం అక్కడ ఉద్యోగం చేసే ఛాన్స్ ఉండేది. కానీ, ఈ కొత్త బిల్లు వస్తే ఈ అవకాశం పోతుంది. చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ దేశానికి వెళ్లాలి, లేకపోతే వీసా గడువు ముగిసిన తర్వాత వాళ్లను అమెరికా ప్రభుత్వం బలవంతంగా దేశం నుంచి పంపిస్తుంది. ఇప్పుడు ఓపీటీలో ఉన్నవాళ్లు, H1B వీసా కోసం ఎదురు చూస్తున్నవాళ్లు కూడా భయపడుతున్నారు.
ఓపీటీ ఎందుకు ముఖ్యం?
అమెరికాలో మాస్టర్స్ (Indian Students USA )చదివిన విద్యార్థులకు ఓపీటీ ఒక పెద్ద అవకాశం. ఈ ఓపీటీ వల్ల వాళ్లు చదువు ముగిసిన తర్వాత అక్కడే ఉద్యోగం చేసే హక్కు పొందుతారు. ఈ సమయంలో వాళ్లు మూడు సంవత్సరాల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఈ గడువులో వాళ్లు ఉద్యోగం చేస్తూనే H1B వీసా కోసం ప్రయత్నిస్తారు. కానీ, ఈ ఓపీటీ రద్దైతే చదువు పూర్తయిన వెంటనే వాళ్లు అమెరికా వదిలి రావాల్సి ఉంటుంది. ఇది వాళ్ల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుంది.
ఇప్పుడు ఏం జరుగుతోంది?
ప్రస్తుతం అమెరికాలో ఉన్న 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు (Indian Students USA )ఈ బిల్లు వల్ల భయపడుతున్నారు. ఇప్పటికే చదువు పూర్తి చేసి ఓపీటీలో ఉన్నవాళ్లు, H1B వీసా కోసం ఎదురు చూస్తున్నవాళ్లు తమ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళనలో ఉన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే వాళ్లు స్వయంగా దేశం వదిలి రావాలి, లేకపోతే అక్రమ వలసదారులుగా మారి బలవంతంగా డిపోర్ట్ అవుతారు. దీనివల్ల వాళ్ల కలలు, కష్టం అన్నీ వృధా అవుతాయని భయం పట్టుకుంది.
ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నారు?
డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా వచ్చినప్పుడు కూడా ఓపీటీని రద్దు చేయాలని చూశారు, కానీ అప్పుడు అది సాధ్యం కాలేదు. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా గట్టిగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అమెరికాలో అక్రమ వలసలను అరికట్టడానికి పెద్ద ఎత్తున డిపోర్టేషన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త బిల్లు కూడా ఆ ప్లాన్‌లో భాగమేనని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్లు గురించి అందరి దృష్టి అమెరికా పార్లమెంట్‌పై ఉంది.
Also Read : Polavaram backwater survey