Anchor shyamala: హోం మంత్రిగా పాలన చేతకాకపోతే వెంటనే దిగిపో.. అనిత పై శ్యామల ఫైర్?

2 Min Read

Anchor shyamala : టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్యామల గత ఎన్నికలలో వైకాపా పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈమె పవన్ కళ్యాణ్ గురించి అలాగే చంద్రబాబు నాయుడు గురించి విమర్శలు చేయడంతో వార్తల్లో నిలిచారు

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాంకర్ శ్యామల పట్ల సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు వినిపించాయి. అంతేకాకుండా తనకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కూడా లేకుండా చేశారని తెలిపారు.ఇలా వైకాపా పార్టీకి మద్దతుగా నిలబడటంతో ఈమెకు అవకాశాలు లేకుండా పోయాయి.

Also Read : CM Chandrababu :తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వు.. సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు

Anchor Shyamala

దీంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వైకాపా అధికార ప్రతినిధిగా ఈమెకు బాధ్యతలు అప్పచెప్పారు. అప్పటినుంచి ఈమె తరుచూ మీడియా సమావేశాలలో పాల్గొంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇటీవల కాలంలో ఏపీలో మహిళలపై అమ్మాయిలపై పెద్ద ఎత్తున అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో ఈమె ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి హోంమంత్రి అనిత పై ప్రశ్నల వర్షం కురిపించడమే కాకుండా పాలన చేతకాకపోతే హోంశాఖ నుంచి దిగిపోవాలనీ డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై గత నాలుగు నెలలుగా పెద్ద ఎత్తున అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అత్యాచారం చేయడమే కాకుండా చివరికి హత్య చేసి చంపుతున్నారు. ఇలా మహిళలకు రక్షణ కోసమే గత ప్రభుత్వం దిశ యాప్ తీసుకువచ్చింది ఈ యాప్ ద్వారా మహిళలు ఎంతో సురక్షితంగా ఉన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దిశ యాప్ ను తీసేశారన్న శ్యామల(Anchor shyamala), దిశయాప్‌ను ఎందుకు తీసేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రతిరోజు ప్రతిపక్ష పార్టీల నేతలను విమర్శించే హోంమంత్రికి శాంతి భద్రతలు కాపాడాలన్న ఆలోచన లేదు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, శాంతి పద్ధతులను కాపాడలేకపోతే హోం శాఖ నుంచి దిగిపోవాలంటూ శ్యామల హోమ్ మినిస్టర్ అనిత పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Share This Article
Exit mobile version