Yamaha R15M : ఇండియా యమహా మోటార్ (IYM) ప్రైవేట్ లిమిటెడ్ కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ గ్రాఫిక్‌తో R15Mని విడుదల చేసింది. ఇది టాప్ లెవల్ జపనీస్ మోటార్‌సైకిల్ డిజైన్, ఇంజనీరింగ్‌కి అనుగుణంగా వస్తుంది. ఈ బైక్‌లో 155సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది R1 నుండి ప్రేరణ పొందింది. యమహా రేసింగ్ డీఎన్‌ఏకు అనుగుణంగా సూపర్‌స్పోర్ట్ బైక్‌లా దీన్ని రూపొందించారు. R15Mలో కొత్త అప్‌గ్రేడ్‌లు యమహా ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ బ్రాండ్ ప్రచారానికి అనుగుణంగా ఉన్నాయి. దాని వివరాలు తెలుసుకుందాం.
ఇందులో కనిపించే కార్బన్ ఫైబర్ నమూనా ప్రసిద్ధ R1M కార్బన్ బాడీ వర్క్ ను నమూనాగా తీసుకుని రూపొందించారు. అద్భుతమైన ఫినిషింగ్‌తో అధునాతన వాటర్ డిప్పింగ్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఈ నమూనాను ఫ్రంట్ కౌల్, సైడ్ ఫెయిరింగ్ , వెనుక వైపు ప్యానెల్‌ల పార్శ్వాలపై చూడవచ్చు. కార్బన్ ఫైబర్ ప్యాటర్న్‌తో పాటు, R15Mలో ఆల్-బ్లాక్ ఫెండర్, ట్యాంక్, సైడ్ ఫెయిరింగ్‌పై కొత్త డీకాల్స్ అలాగే డ్యూయల్ బ్లూ కలర్ వీల్స్ ఉన్నాయి. ఇవి చాలా ఎట్రాక్టివ్ గా ఉన్నాయి.
టర్న్-బై-టర్న్ నావిగేషన్ కొత్త అప్‌గ్రేడ్‌లలో R15M ఇప్పుడు మ్యూజిక్, వాల్యూమ్ కంట్రోల్ ఫంక్షన్‌ల కోసం టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్‌ను కలిగి ఉంది. ప్లే స్టోర్ (ఆండ్రాయిడ్)/యాప్ స్టోర్ (iOS)లో అందుబాటులో ఉన్న Y-కనెక్ట్ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. బైక్‌తో కనెక్ట్ అయ్యేందుకు రైడర్ వారి స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయాలి. ఇది మాత్రమే కాదు, మోడల్‌లో అప్‌గ్రేడ్ చేయబడింది. స్విచ్ గేర్, వినియోగదారుల కోసం కొత్త LED లైసెన్స్ ప్లేట్ లైట్ కూడా ఉంది.
ఇంజిన్ పవర్ట్రైన్
R15M శక్తివంతమైన ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన 155cc ఇంజన్‌తో వస్తుంది, ఇది 7,500rpm వద్ద గరిష్టంగా 14.2Nm టార్క్, 10,000rpm వద్ద 13.5kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
బ్లూటూత్ కనెక్టివిటీతో సహా అనేక ఫీచర్లు
ఇందులోని ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ సపోర్టివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఇది కాకుండా, ఇది పూర్తి డిజిటల్ కలర్ TFT స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీతో సహా అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.
ధర ఎంత?
కార్బన్ ఫైబర్ నమూనాతో కొత్త R15M ధర రూ. 2,08,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) . దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా యమహా బ్లూ స్క్వేర్ షోరూమ్ నుండి కొనుగోలు చేయవచ్చు. మెటాలిక్ గ్రేలో అప్‌గ్రేడ్ చేసిన R15M ధర రూ. 1,98,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీనిని అన్ని యమహా డీలర్‌షిప్‌లలో కొనుగోలు చేయవచ్చు.