Y.S Vijayamma: ఫేక్ లెటర్ పై స్పందించిన వైయస్ విజయమ్మ… పరువు నష్టం దావా వేస్తానంటూ?

2 Min Read

Y.S Vijayamma : ఏపీలో వైయస్ కుటుంబం గురించి రోజుకు ఒక వార్త రాజకీయాల పరంగా పలు చర్చలకు కారణం అవుతుంది. గత కొద్దిరోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లి తల్లితో ఆస్తి వివాదాల ద్వారా వార్తలలో నిలిచారు. అయితే ఈ ఆస్తి వివాదంలో వైఎస్ కుటుంబం కంటే కూడా కూటమి ప్రభుత్వం చాలా ఆసక్తి కనబరుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే వీరి మధ్య ఆస్తివివాదాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి తన తల్లిని కూడా చంపడానికి ప్లాన్ చేశారు అంటూ తెలుగుదేశం నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఈ ప్రమాదం వెనుక జగన్ ప్రమేయం ఉంది అంటూ తెలుగుదేశం నేతలు ఒక పోస్ట్ చేశారు.

Also Read : Pawan Kalyan : అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్.. ఇంకొకసారి ఓజీ అంటే అంటూ?

Y.s vijayamma

ఈ పోస్ట్ పై వైఎస్ విజయమ్మ(Y.S Vijayamma) స్పందిస్తూ ఈ కారు ప్రమాదంలో తన కొడుకు ప్రమేయం ఏ మాత్రం లేదని ఇదంతా కూడా తన కొడుకును రాజకీయంగా దెబ్బతీయడం కోసమే చేస్తున్న కుట్ర అంటూ ఒక లెటర్ విడుదల చేశారు. ఇలా వైయస్ విజయమ్మ రాసిన ఈ లేఖ ఫేక్ అని ఆ లెటర్ వైకాపా నాయకులే రాసి వైఎస్ విజయమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేశారు అంటూ మరో వార్తను ప్రచారం చేశారు.

ఇలా తన గురించి తన కుటుంబం గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో స్వయంగా వైఎస్ విజయమ్మ ఓ వీడియోని విడుదల చేశారు.ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా నా కుటుంబం గురించి సోషల్ మీడియాలో, మీడియా వార్తలలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.

ముఖ్యంగా నా కారు ప్రమాదంలో నా కొడుకు ప్రమేయం ఉందంటూ ప్రచారం చేస్తున్న వార్తలలో నిజం లేదు. పచ్చకామర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనపడుతుందని ఈమె కౌంటర్ ఇచ్చారు.మా కుటుంబంలో వివాదాలు అదునుగా చేసుకొని చాలామంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారి పట్ల నేను పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. మాకు ఆస్తి గొడవలు ఉంటే జగన్ నా కొడుకు కాకుండా పోరు, షర్మిల నాకు కూతురు కాకుండా పోదు.

వారిద్దరూ అన్న చెల్లెలు కాకుండా పోరు. నా గురించి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు ఎన్నికల సమయంలో నేను నా మనవడి దగ్గరికి వెళ్తే కూడా జగన్ కి భయపడే వెళ్లారు అంటూ తప్పుడు వార్తలను సృష్టించారు. ఇంకోసారి ఇలాంటి వార్తలు వస్తే తప్పనిసరిగా పరువు నష్టం దావా వేస్తా అంటూ ఈమె ఒక వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Share This Article
Exit mobile version