Chandra Babu : గేమ్ మొదలుపెట్టిన బాబు… జగన్ పై వేటు పడనుందా?

Chandra Babu : రాజకీయాలలో కీలక నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అందరూ గౌరవించే లాగా ఉండాలి కానీ విమర్శించే లాగా ఉండకూడదు. ప్రస్తుతం వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మొండి నిర్ణయం పెద్ద ఎత్తున విమర్శలకు కారణమవుతుంది. 2024 ఎన్నికలలో భాగంగా కూటమి నేతలు ఏకంగా 164 స్థానాలలో విజయం సాధించగా వైకాపా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలి అంటే 10% సీట్లు రావాల్సి ఉంటుంది కానీ వైకాపా పార్టీకి అంత మొత్తంలో సీట్లు రాలేదు దీంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది.

ఇక ఈయన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లిన అక్కడ ఆయనకు మైక్ ఇవ్వరు. ఈ క్రమంలోనే ఇదే అదునుగా భావించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను అసెంబ్లీకి వెళ్ళేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన వైకాపా అధినేతగా అసెంబ్లీలోకి వెళ్లి ప్రజల తరఫున మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన హక్కు ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తేనే వెళ్తానని చెబుతున్నారు తప్ప తనకు ఓట్లు వేసిన వారికి అండగా నేనున్నాను అంటూ భరోసా ఇవ్వలేకపోతున్నారు.

Also Read : CM Chandrababu :తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వు.. సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు

Chandra babu

జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెడితే కూటమినేతలు ఆయన పట్ల రివెంజ్ తీర్చుకునే అవకాశాలు లేకపోలేదు గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు (Chandra Babu) నాయుడుని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఆయనకు కనీసం మైక్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని జగన్ భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఆయన మాత్రం పోరాటం చేస్తూనే చివరికి విజయం సాధించారు. ఈ విషయం జగన్ చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 190 ప్రకారం 60 రోజుల పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన వ్యక్తి సభాపతి అనుమతి లేకుండా అసెంబ్లీకి వెళ్లకపోతే ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా అనర్హత వేటు వేయించుకుంటారా లేదా సభకు వచ్చి సంతకాలు చేసి వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈయన కనుక అసెంబ్లీకి రాకపోతే చంద్రబాబు నాయుడు తన వ్యూహాన్ని అమలు పరుస్తూ వైకాపా 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని తెలుస్తోంది.

Share This Article
Exit mobile version