Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలోకి కంటెస్టెంట్లుగా వెళ్లేవారు ఎన్నో నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియ కూడా చాలా పకడ్బందీగా జరుగుతుంది. కంటెస్టెంట్ గా వెళ్లడం కోసం ఎలాంటి రెకమండేషన్స్ కూడా పనికిరావు అంటూ ఇదివరకే పలువురు సెలబ్రిటీలు బిగ్ బాస్ ఎంపిక ప్రక్రియ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. కొన్ని ఇంటర్వ్యూల ద్వారా మనల్ని ఎంపిక చేస్తారని తెలిపారు. ఇక మనం ఫైనల్ రౌండ్ వరకు వెళ్లి రెమ్యూనరేషన్ దగ్గర నచ్చక కూడా వెనక్కి వచ్చిన వారు చాలామంది ఉన్నారు.
ఇక బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లే కంటెస్టెంట్లు వారు చెప్పిన రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వారు కంటెస్టెంట్లుగా ఎంపిక అయిన విషయాన్ని ఎవరికి తెలియచేయకూడదు. అలా తెలియజేస్తే తప్పనిసరిగా భారీ స్థాయిలో ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారిని బిగ్ బాస్ నుంచి తప్పిస్తారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించిన లగేజ్ విషయంలో కూడా చాలా రూల్స్ ఉంటాయి.
కొన్ని వస్తువులను హౌస్ లోకి తీసుకు వెళ్ళడానికి ఏమాత్రం ఒప్పుకోరు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో బయట నుంచి లోపలికి తీసుకు వెళ్లడానికి అనుమతి ఉండదు. అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా హౌస్ లోకి అలోక్ చేయరు. ముఖ్యంగా చేతి వాచ్ లను హౌస్ లోకి అసలు అనుమతి ఇవ్వరని తెలుస్తోంది. అయితే హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లకు ఎందుకని ఈ చేతి వాచ్ లకు పర్మిషన్ ఉండదనే సందేహం చాలా మందికి ఉంటుంది.
ఇటీవల కాలంలో చేతి వాచీలు చాలా అప్డేట్ అయ్యాయి. ఈ చేతి వాచ్ ద్వారా మనం ఎంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే సమాచారాన్ని బయటకు పంపించవచ్చు ఇలా కమ్యూనికేషన్ కు ఎంతో కీలకంగా ఉంటుంది కనుక ఈ చేతి వాచ్లను బిగ్ బాస్ హౌస్ లోకి అనుమతించరు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య పోటాపోటీన టాస్కులను నిర్వహిస్తూ ఉంటారు.
ఇలా టాస్కులను పెట్టినప్పుడు చేతి వాచీలు ఉండటం వల్ల వారి కాన్సన్ట్రేషన్ మొత్తం సమయం మీదే ఉంటుంది తప్ప టాస్కులను గెలవాలనే దానిపై దృష్టి ఉండదు. అందుకోసమే బిగ్ బాస్ హౌస్ లోకి ఈ వాచెస్ కూడా అనుమతి ఉండదని తెలుస్తోంది. ఇక వాచ్ కనుక హౌస్ లోకి అలో చేస్తే వారు ఎంతో అభద్రత భావానికి గురి అవుతారని అలా కాకుండా చేతి వాచ్ లేకపోతే సమయం తెలియకుండా అక్కడ ఉన్న వారితో సరదాగా గడపటం ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ చేతి వాచ్ లను బిగ్ బాస్ హౌస్ లోకి అలో చేయరని తెలుస్తోంది.