Ratan Tata : టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఇక లేరు. బ్రీచ్ క్యాండీలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విధంగా రతన్ టాటా మరణ వార్త దేశవ్యాప్తంగా అందరిని ఎంతగానో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇక టాటా మరణించడంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం గురించి ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో, మీడియా వార్తలలో వైరల్ అవుతున్నాయి.
ఇక రతన్ టాటా(Ratan Tata) పెళ్లి చేసుకోలేదనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే టాటా మరణం తర్వాత ఆయన టాటా గ్రూప్స్ సంస్థలకు అధినేత, వారసుడు ఎవరు అనే విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎవరు నడిపిస్తారోనని తెలుసుకోవాలనుకుంటున్నారా? నిజానికి, రతన్ టాటా.. ఇందుకు ఏర్పాట్లు ఎప్పుడో పూర్తి చేశారు. టాటా గ్రూప్‌కి ప్రస్తుతం ఎన్ చంద్రశేఖ టాటా సన్స్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2017 నుంచి ఆ బాధ్యతలు చేపట్టారు. ఆయన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వివిధ వ్యాపార రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు.
Also Read : అస్తమించిన వ్యాపార దిగ్గజం.. Ratan Tata ఆఖరి పోస్ట్ ఇదే?
Ratan Tata Passes Away: Who Will Be the Successor to the Tata Empire?
ఇక సిమోన్‌తో నావల్ టాటా రెండో భార్య కుమారుడు నోయెల్ టాటా.. రతన్ టాటాకి(Ratan Tata) సవతి సోదరుడు. తాజా పరిస్థితుల్లో నోయెల్ టాటాను ఈ వారసత్వాన్ని అందుకునే ప్రధాన పోటీదారుల్లో ఒకరుగా చెప్పవచ్చు. ఇక నోయల్ టాటాకు ముగ్గురు సంతానం. మాయ, నెవిల్లే, లేహ్ టాటా. ఈ ముగ్గురు ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా టాటా గ్రూప్స్ కి చెందిన పలు వ్యాపారాలను చూసుకుంటూ ఉన్న నేపథ్యంలో వీళ్లే ఈ సంస్థలకు వారసులుగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇక టాటా గ్రూప్స్ విలువ ఎంత ఏంటి అనే విషయాల గురించి కూడా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. నివేదికల ప్రకారం.. ఆగస్టు 2024 నాటికి, టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీల మార్కెట్ క్యాప్ 400 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.35 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం కంపెనీకి చెందిన 29 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి.