Samantha : సినీనటి సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె టాలీవుడ్ నటుడు నాగచైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇలా మూడు సంవత్సరాలు పాటు వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగినప్పటికీ ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్శల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడంతో వీరి విడాకులకు సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక నాగచైతన్య మాత్రం తదుపరి మరో వివాహానికి కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈయన నటి శోభితను నిశ్చితార్థం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కానీ సమంత మాత్రం ఇప్పటివరకు సింగిల్గానే ఉంటున్నారు. తాజాగా సమంత తన సోషల్ మీడియా వేదికగా పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఒకసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read : Samantha: ఆ హీరో నాకు గురు సమానులు.. సమంత కామెంట్స్ వైరల్!
Wedding celebrations at actress Samantha’s house
సమంత ఇంట్లో పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయని తెలుస్తుంది అయితే పెళ్లి తన సోదరుడు డేవిడ్ ప్రభు, నికోలాయ్ అనే విదేశీ యువతి వివాహం జరిగింది. ఆ సమయంలో సమంత తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను ఇప్పుడు విడుదల చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ పెళ్లి ఫోటోలలో భాగంగా సమంత కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు. అయితే ఈ వివాహం విదేశాలలోనే జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సమంత చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇక నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారు మరి సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమవుతుందా.. లేక ఇలాగే సింగిల్గానే జీవితంలో కొనసాగుతారా అంటూ అభిమానులు సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.