ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైనా, సీఎం

జగన్మోహన్ రెడ్డి పైనా ఒంటి కాలిపై లేచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్..పూర్వపు

ఉభయ గోదావరి జిల్లాలో పట్టు సాధించడానికి సిద్ధమవుతున్నారు. టీడీపీతో ఒకవైపు పొత్తు, మరోవైపు

కేంద్రంలో బీజేపీ పొత్తు పెట్టుకుని..రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికలలో జనసేన

ఎక్కువ స్థానాలలో పోటీచేసి విజయం సాధించాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్నారు.