హుందాతనానికి మారు పేరు ‘కియా సోల్’ అని వాహనచోదకులు చెప్పే మాట. ఇది సబ్ కాంపాక్ట్ కారు.

2008 నుంచి కియా ఈ కార్లను తయారు చేస్తోంది. విక్రయిస్తోంది. సోల్ మొదటిసారిగా 2006లో

డెట్రాయిట్ లోని నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో ప్రదర్శించబడిన కాన్సెప్ట్

మోడల్ రూపంలో కనిపించింది. అయితే ఉత్పత్తి మోడల్ మాత్రం 2008లో పారిస్ మోటార్ షోలో తొలిసారిగా దర్శనమిచ్చింది.

కియా సోల్ ఉత్తర అమెరికా మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని 18 నుండి 35 ఏళ్ళ శ్రేణిలో కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంది.