ప్రముఖ ఫోర్డ్ మోటార్ కంపెనీ తన ప్రీమియం ఉత్పత్తుల్లో కొన్నింటితో భారత మార్కెట్లోకి

మళ్లీ ప్రవేశపెట్టొచ్చని ఇప్పటికే సమాచారం అందుతోంది. ఫోర్డ్ ఇటీవల JSW తో తన చెన్నై

ప్లాంట్ విక్రయ ఒప్పందాన్ని రద్దు చేసింది. అదేవిధంగా ఎండీవర్ SUVకి పేటెంట్ కూడా ఇచ్చింది.

ఇది కాకుండా కంపెనీ సీనియర్ పోస్టుల కోసం కొన్ని ఖాళీలను కూడా పోస్ట్ చేసింది.

ఇప్పుడు అమెరికన్ ఆటోమేకర్ ఫోర్డ్ ముస్టాంగ్ మ్యాక్-ఇ ట్రేడ్‌మార్క్‌ను భారతదేశంలో నమోదు చేసింది.