Viswambhara : అభిమానులకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్న చిరు.. ఏ రేంజ్ లో ఉండబోతోందంటే..!…..

2 Min Read

Viswambhara: ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే రీఎంట్రీలో మరింత జోష్‌తో కనిపిస్తోన్న చిరూ.. ఇప్పటికే పలు సినిమాల ద్వారా వచ్చి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రెజెంట్ చిరంజీవి.. ‘బింబిసార’తో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని అందుకున్న డైరెక్టర్ మల్లిడి వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమానే ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరో ముల్లోకాలను చుట్టి వచ్చే అతీత శక్తులున్న వ్యక్తిగా చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను తీస్తున్నారు.

ఇకపోతే టెక్నికల్ వండర్‌గా రాబోతోన్న ‘విశ్వంభర’ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌‌ను ఈ ఏడాది స్టార్టింగ్ లోనే మొదలు పెట్టారు. అప్పటి నుంచి చిత్ర యూనిట్ వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 50 % వరకూ టాకీ పార్టు కూడా పూర్తి అయిపోయింది. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ లోనే వినూత్నమైన కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ మూవీపై హైప్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఐతే, ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ ఫ్యాన్స్ సంతృప్తి పడేలా వీడియోలు రిలీజ్ కాలేదు. దీంతో వాళ్లంతా నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చిరంజీవి తన అభిమానులకు సర్‌ ప్రైజ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

క్రేజీ కాన్సెప్టుతో రూపొందుతోన్న ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన టీజర్‌ ను రిలీజ్ చేయాలని తాజాగా ప్లాన్ చేసినట్లు ఓ న్యూస్ లీకైంది. దీన్ని దసరా కానుకగా తీసుకు రాబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లోనే రానుందని చెప్తున్నారు. దీన్ని మెగా ఫ్యాన్స్ ఊహించని విధంగా వైవిధ్యంగా కట్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఇదిలా ఉండగా.. చిరూ హీరోగా చేస్తోన్న ‘విశ్వంభర’ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో అందాల ముద్దుగుమ్మ త్రిష హీరోయిన్‌ గా.. సురభి, ఈషా చావ్లా, నవీన్ చంద్ర, రాజ్‌ తరుణ్‌లు కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి దీనికి మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

Share This Article