నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలలో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు నటి తమన్నా. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు ఈమె గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే.
వీరిద్దరూ లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇలా అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లిన జంటగా కనిపించడంతో వీరి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల స్పందించిన ఈ జంట తమ రిలేషన్ గురించి అందరికీ తెలియజేశారు. ఇలా రిలేషన్ లో కొనసాగుతున్న ఈ జంట పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదు. దీంతో తరచూ వీరి పెళ్లి గురించి కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు తమ ప్రేమ గురించి అలాగే బ్రేకప్ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో తమన్నా విజయ్ వర్మతో కలిసి పిల్లల్ని కనడం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. చిన్నపిల్లల్ని కనడం అనే అంశం ఎంతో ప్రత్యేకమైంది అని, వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం, వారితోనే కలిసి ఉండడం వంటివి ఇలా చాలానే చెయ్యాల్సి ఉంటుంది.
చిన్నప్పుడు మా అమ్మానాన్నలు నన్ను ఎంతో గారాబంగా పెంచారు. నాకు ఆ కన్న ప్రేమ గుర్తుంది. మరి ఇప్పుడు పిల్లలు కావాలి అంటే ఆ ఫీలింగే మరో రకంగా ఉందని అందుకే పిల్లలని కనడం అనే అంశం నాకు కొంచెం భయంగానే ఉంటుంది అంటూ పిల్లల్ని కనడం గురించి తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె చేసిన మాటలను బట్టి చూస్తుంటే పిల్లలు అంటే పెద్దగా ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది.