Vijay : తమిళ స్టార్ హీరో విజయ్ దలపతి రీసెంట్ గా గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఆ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సక్సెస్ అయింది. రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఇక విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడని టాక్. గోట్ సినిమా కోసం విజయ్ రూ. 250 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు అంతకు మించి వసూళ్లు చేస్తున్నట్టు ఇండస్ట్రీలో లేటెస్ట్ న్యూస్. మరి విజయ్ తన తదుపరి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గోట్ సినిమా తర్వాత విజయ్ సినిమాలకి గుడ్‌బై చెప్పి రాజకీయాల్లో బిజీ కావాలని అనుకుంటున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఈ సినిమా కోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటారని కోలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది. దళపతి విజయ్ 69వ సినిమాపై అధికారిక ప్రకటన చేశారు. విజయ్‌కి ఇదే చివరి సినిమా. ఈ చిత్రాన్ని కన్నడ కేవీఎం ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుంది. ఇదే తన చివరిది అని అధికారికంగా ప్రకటించారు కూడా. విజయ్ అభిమానులకు ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఈ నేపథ్యంలో విజయ్ తన గత చిత్రానికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడని సమాచారం.
విజయ్ దళపతి తన 69వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అందరికి షాక్ ఇచ్చే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడట. రూ. 275 కోట్ల రూపాయల పారితోషికం అందుకోనున్నట్టు సమాచారం. ఇండియాలో ఇప్పటి వరకు ఏ నటుడూ ఇంత భారీ రెమ్యూనరేషన్ అందుకోలేదని అంటున్నారు. ఇటీవల భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుల జాబితా విడుదలైంది. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సినీ సెలబ్రిటీల జాబితాలో దళపతి విజయ్ రెండో స్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ బ్యాడ్ షారుఖ్ ఖాన్ నంబర్ వన్ ప్లేసులో. సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు విజయ్ దళపతి రేంజ్ పెరిగింది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమాకు ఎన్ని కోట్లు బడ్జెట్ ఖర్చు చేస్తున్నారో చూడాలి. ఏది ఏమైనా విజయ్‌ని తీసుకోవడంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా పోస్టర్ ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. భారీ యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా రాబోతుందని పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమాని ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనేది త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.