Vijay Devarakonda : జారిపడ్డ విజయ్‌ దేవర కొండ.. దెబ్బ తగిలిందా?

3 Min Read

Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఆయన కొత్త సినిమా లుక్‌పై చర్చ జరుగుతుండగా, ఆయన గాయాలతో బాధపడుతున్నారనే మరో వార్త వైరల్‌గా మారింది. ఇదే కాకుండా, విజయ్‌ తన వీడియో సాంగ్ ఆల్బమ్‌తో వార్తల్లో నిలిచాడు. వీటన్నింటితో పాటు ఆయన ఎదుర్కొంటున్న కొన్ని అవమానాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆయన గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మెట్లపై నుంచి జారిపడి గాపడ్డాడనే వార్తతో వైరల్‌గా మారాడు విజయ్‌. విజయ్ దేవరకొండ ముంబైలో మెట్టు దిగుతుండగ జారిపడ్డాడు. ఇటీవలే ‘సాహిబా’ అనే వీడియో సాంగ్ ఆల్బమ్‌లో నటించిన సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని లేటెస్ట్‌గా ప్రకటించారు. ఇందులో రాధిక మదన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ సాంగ్ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) శుక్రవారం ముంబైలో సందడి చేశారు. ఈ కార్యక్రమం అనంతరం బయటకు వస్తుండగా అభిమానులను చూస్తూ మెట్టు దిగుతున్న విజయ్‌ ఇక్కసారిగా జారిపడ్డాడు. వెంటనే స్పందించిన బృందం విజయ్‌ని పట్టుకుని పైకి లేపారు. కానీ విజ‌య్ ఘ‌ట‌న చూస్తుంటే ఆయ‌న తీవ్రంగా గాయపడ్డారని అర్థం అవుతుంది. కానీ దాని నుంచి తేరుకుని మామూలుగానే తన కారు వద్దకు వచ్చాడు. కాకపోతే విజయ్ కాస్త డల్ గా కనిపించాడు.

Also Read : Vijay : దేశంలో ఏ హీరో అందుకోని రెమ్యునరేషన్ అందుకుని విజయ్ రికార్డ్.. ఎంతంటే?

Vijay Devarakonda

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల `విడి12 షూటింగ్‌లో విజయ్ భుజానికి గాయమైంది. అయితే దానిని లెక్క చేయకుండా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సారధి స్టూడియోస్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్(Vijay Devarakonda) అదిరిపోయే లుక్స్‌ తో కనిపిస్తున్నాడు. అంతేకాదు తాజాగా చిత్రబృందం విడుదల చేసిన లుక్ కూడా గూస్‌ బంమ్స్‌ తెప్పిస్తోంది. సినిమా ఇదే రేంజ్ లో ఉంటే బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం. విజయ్ రెండు మూడు వందల కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తాడంటే అతిశయోక్తి కాదు. అయితే.. విజయ్‌కి గాయాలయ్యాయన్న వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. విజయ్‌కి ఇలా జరుగుతుంది ఏమిటి అని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు తాజా వీడియో కాస్త పరువు తీసేలా ఉంది.

ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ కి చాలా క్రేజ్ ఉంది. విజయ్‌ కి లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ ఎక్కువే. వీళ్లంతా తమకు ఎంతగానో నచ్చిన విజయ్‌ని చూసి కంగారుపడ్డారని చెప్పొచ్చు. అయితే ఇందులో విజయ్ బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. ప్రెస్ మీట్ తో పాటు వాకింగ్ లో కూడా డల్ గా ఉన్నాడు. పని ఒత్తిడి కారణంగా బాగా అలసిపోయినట్లు సమాచారం. అయితే అమ్మాయిల క్రష్‌ విజయ్‌కి ఇలా జరగడం బాధాకరం. కానీ.. ఇప్పుడు విజయ్ బాగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం విజ‌య్ న‌టిస్తున్న వీడి 12 షూటింగ్ ఈ ఏడాది చివ‌రిక‌ల్లా పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఆయన పాత్ర షూటింగ్ ఈ నెలాఖరుకి పూర్తవుతుందని సమాచారం. ఆ తర్వాత కాస్త రెస్ట్ తీసుకుని తన తదుపరి సినిమాకి వెళ్లనున్నారు లవర్‌ బాయ్‌. అంటే వచ్చే ఏడాది రాహుల్ సాంక్రిత్యాన్‌ సినిమా చేయబోతున్నాడు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో `విడి15 విడుద‌ల కానుంది.

Share This Article
Exit mobile version