Varun Tej-Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్ నవంబర్ ఒకటవ తేదీ సినీనటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరి వివాహం ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహం జరిగి సరిగ్గా నిన్నటికి ఏడాది పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా మెగా కుటుంబ సభ్యులందరూ ఈ జంటకు మొదటి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి(Varun Tej-Lavanya) మిస్టర్ అంతరిక్షం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని ఎంతో రహస్యంగా ఉంచిన ఈ జంట ఏకంగా నిశ్చితార్థంతో తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. సోషల్ మీడియాలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరూ ఆ వార్తలను తోసిపుచ్చారు.
Also Read : Samantha: అతన్ని ఇప్పటికీ చాలా మిస్ అవుతున్నా.. సమంత పోస్ట్ వైరల్… నాగచైతన్య గురించేనా?
Varun Tej-Lavanya’s First Wedding Anniversary – Special Video Goes Viral!
ఇక వీరిద్దరూ తమ నిశ్చితార్థపు తేదీని ప్రకటించి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకొని అనంతరం ఇటలీలో వివాహం చేసుకున్నారు.ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి పూర్తిగా ఇంటికి పరిమితమయ్యారని చెప్పాలి. వరుణ్ తేజ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు, త్వరలోనే ఈయన మట్కా అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు
. ఇక వీరి మొదటి పెళ్లి రోజు కావడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ది క్లౌడ్స్ ఆన్ ది హౌస్ అనే సంస్థ వీరి పెళ్లికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశారు. ఇందులో భాగంగా వరుణ్ తేజ్ లావణ్య హల్దీ సంగీత పెళ్లికి సంబంధించిన కొన్ని క్లిప్స్ చేర్చారు అలాగే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ చిరంజీవి కూడా ఈ వీడియోలో సందడి చేస్తూ కనిపించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది మెగా అభిమానులు ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే లావణ్య త్రిపాటి తల్లి కాబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా ఓ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని కూడా మెగా ఫ్యామిలీ సీక్రెట్ గా ఉంచారని సమాచారం. మరి లావణ్య తల్లి కాబోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే మెగా ఫ్యామిలీ అధికారకంగా వెల్లడించాల్సి ఉంది.