Sreeleela : శ్రీ లీలకు దీపావళి గిఫ్ట్ పంపిన హీరో.. ప్రేమ విషయాన్ని ఇలా బయటపెట్టారా?

2 Min Read

Sreeleela : పెళ్లి సందడి సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్రీ లీల. మొదటి సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈమె నటన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈమెకు రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది . ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీలీలకు(Sreeleela) వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఈమె ఏ ఒక్క సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు తద్వారా ప్రస్తుతం సినిమా అవకాశాలు కాస్త తగ్గాయని చెప్పాలి. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి మాస్ జాతర అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.

Also Read : Ramcharan: రామ్ చరణ్ తో పాటు రైమ్ కి దక్కిన అరుదైన గౌరవం.. సంతోషంలో అభిమానులు!

Sreeleela

ఇదిలా ఉండగా తాజాగా శ్రీ లీలకి సంబంధించి ఓ వార్త గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల పారిస్ వెకేషన్ వెళ్లిన ఈమె తన ప్రియుడితో కలిసి వెళ్లారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా శ్రీ లీలకి తన ప్రియుడు గిఫ్ట్ పంపించారు అంటూ మరో వార్త వైరల్ అవుతుంది. అయితే తనకు ఈ గిఫ్ట్ పంపినది మరెవరో కాదు మెగా హీరో అంటూ వార్తలు వినపడుతున్నాయి.

మెగా హీరోగా ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు పంజా వైష్ణవ్. ఉప్పెన సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చిన అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో సక్సెస్ కోసం వైష్ణవ్ ఎంతగానో కష్టపడుతున్నారు. ఇక ఈ హీరో శ్రీ లీల ప్రేమలో పడ్డారని, తనకు ఓ ఖరీదైన గిఫ్ట్ కూడా పంపించారనే వార్తలు రావడంతో పలువురు నేటిజన్స్ ఈ వార్తలపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక వీరిద్దరూ ఆది కేశవ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా వీరిద్దరి నటన అద్భుతంగా ఉందని చెప్పాలి. అయితే గతంలో కూడా హీరో వైష్ణవ్ కృతి శెట్టి ప్రేమలో పడ్డారు అంటూ కూడా వార్తలు వినిపించాయి కానీ ఆ వార్తలు ఏమాత్రం నిజం కాదని కృతి శెట్టి ఖండించారు. మరి ఇప్పుడు శ్రీ లీలతో ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Share This Article
Exit mobile version