Upasana: యువ మహిళలకు ఉపాసన బంపర్ ఆఫర్.. ఊహించలేదుగా..?

అందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. మీరు ఆరోగ్య సంరక్షణ రంగంలో ముందుకు వెళ్లాలనుకుంటున్నారా.. మహిళలు ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి ఒక వ్యవస్థను

2 Min Read

Upasana: మెగా కోడలు ఉపాసన రామ్ చరణ్ కు భార్య కాకముందు అపోలో కంపెనీల ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అపోలోలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ అపోలోను విస్తరించడమే కాకుండా కొత్త తరహా వ్యాపారాలను ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ.. ఆర్థికంగానూ ఎదుగుతోంది. . ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా తనతో పాటు ఎంతో మంది యువతులకు ఆర్థిక భరోసా కల్పిస్తానని చెప్పింది. ఇప్పుడు ఉపాసన ఉద్దేశం ఏమిటో చూద్దాం..

ఆమె ఇటీవల ఆరోగ్య సంరక్షణ రంగంపై మరింత దృష్టి సారించింది. యువతుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ప్రకటిచింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. హెల్త్ కేర్ రంగంలో వ్యాపారం చేయాలనుకునే యువతుల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. నేను మీ సహ వ్యవస్థాపకుడిని అవుతాను. నేను మీ భాగస్వామిగా ఉంటాను. నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మార్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. మీరు ఆరోగ్య సంరక్షణ రంగంలో ముందుకు వెళ్లాలనుకుంటున్నారా.. మహిళలు ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి ఒక వ్యవస్థను నిర్మించేందుకు నాతో చేతులు కలపండి. మీ వ్యాపార ప్రయోజనం, మీ వ్యాపారం ఎవరిపై ప్రభావం చూపుతుంది, ,అసలు మీ బిజినెస్ మన ప్లానెట్ కి ఎలాంటి పాజిటివిటీని ఇస్తుంది. నన్ను ఎందుకు మీరు మీ కో ఫౌండర్ గా కోరుకుంటున్నారు వంటి వివరాలను cofounder@urlife.co.in వెబ్సైటులో సబ్మిట్ చేయండని తెలిపింది. ఉపాసన మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా హెల్త్ కేర్ రంగంలో రాణించాలనుకుంటే మీ ఆలోచనలతో ఉపాసన ను కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఉపాసన విషయానికి వస్తే.. రామ్ చరణ్ భార్యగా మరింత పేరు ప్రఖ్యాతలను తెచ్చుకుంది. ఓ వైపు భర్త ఆలనా పాలనను చూసుకుంటూనే వ్యాపార రంగంలోనూ, కూతురి క్లీన్ కారా వ్యవహారాల్లో మరింత బిజీ అయిపోయింది. ఇక ఇప్పుడు యువతులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఏది ఏమైనా ఉపాసన మంచి మనసు మరోసారి రుజువైందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గతంలో కరోనా వచ్చినప్పుడు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే కాకుండా కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చర్చించారు. ఎంతో మందికి అండగా నిలిచిన ఉపాసన.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా, వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నా.. తన వద్దకు వెళితే తప్పకుండా సాయం చేస్తామని చెబుతోంది. దీంతో మరోసారి మంచి మనసున్న అమ్మాయిగా పేరు తెచ్చుకుంది

TAGGED:
Share This Article
Exit mobile version