Trisha: విజయ్ గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం త్రిష రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

2 Min Read

Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి త్రిష ఒకరు. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన త్రిష క్రమక్రమంగా అవకాశాలను కోల్పోతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న త్రిష అనంతరం పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తిరిగి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఇకపోతే ఇటీవల డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో హీరో విజయ్ సరసన లియో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి విజయ్ కోసం ఈమె ఆయన నటించిన గోట్ సినిమాలో ఏకంగా స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా వెనకాడ లేదు. ఇప్పటివరకు త్రిష ఏ సినిమాలో కూడా ఇలా స్పెషల్ సాంగ్ చేయలేదు కానీ హీరో విజయ్ కోసం మొదటిసారి ఈమె స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గోట్ లో త్రిష చేత మట్ట అనే స్పెష‌ల్ సాంగ్ చేయించారు. అయితే ఈ సాంగ్ కు త్రిష తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ సినిమాలో విజయ్ సరసన కనీసం ఒక రెండు నిమిషాలు కూడా త్రిష కనిపించకపోయినా ఈమె రెమ్యూనరేషన్ మాత్రం 1.2 కోట్ల రూపాయలు తీసుకున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ అందరు కూడా ఇలా స్పెషల్ సాంగ్స్ కోసం కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఒకప్పుడు ఇలాంటి సాంగ్స్ చేయడం కోసం సపరేట్ డాన్సర్స్ ఉండేవారు. కానీ ప్రస్తుతం మాత్రం స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

TAGGED:
Share This Article