Best CNG Cars : భారతీయ కస్టమర్లలో సీఎన్జీ కార్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. భవిష్యత్తులో కొత్త సీఎన్జీ కారు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుందో తెలుసుకోవాలి. వాస్తవానికి సీఎన్జీ కార్లు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల కంటే మెరుగైన మైలేజీని అందిస్తాయి. అందుకే సీఎన్జీ కార్లు పెట్రోల్, డీజిల్ మోడల్‌ల కంటే కొంచెం ఖరీదుగా ఉంటాయి. అయితే, ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో అనేక కంపెనీలకు చెందిన సీఎన్జీ మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. సీఎన్జీ పవర్‌ట్రెయిన్‌తో మెరుగైన మైలేజీని అందించడమే కాకుండా, బడ్జెట్ సెగ్మెంట్‌లో కూడా వస్తున్నాయి. వీటిలో దేశంలో అత్యధిక కార్లను విక్రయిస్తున్న కంపెనీ మారుతీ సుజుకీ ముందంజలో ఉంది. వారి కస్టమర్లకు అద్భుతమైన మైలేజీని(Best Cars) అందించడమే కాకుండా సరసమైన ధరలలో(Best Cars) కూడా వచ్చే అటువంటి 5 సీఎన్జీమోడళ్ల గురించి తెలుసుకుందాం.
మారుతీ సుజుకి సెలెరియో సీఎన్జీ
మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ మోడల్ సరసమైన ధరలో మెరుగైన మైలేజీని అందించే విషయంలో బెస్ట్ చాయిస్. మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ దాని వినియోగదారులకు కిలోగ్రాముకు 34 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. భారత మార్కెట్లో మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.74 లక్షలు.
Also Read : BMW Cars Discounts: త్వరపడండి.. బీఎండబ్ల్యూ కార్లపై ఏకంగా రూ.7లక్షల డిస్కౌంట్
Top 4 Best CNG Cars Under ₹6 Lakhs
మారుతి సుజుకి ఆల్టో K10 సీఎన్జీ
మీరు సరసమైన ధరలో మెరుగైన మైలేజీతో కూడిన సీఎన్జీకారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మారుతి సుజుకి ఆల్టో K10 బెస్ట్ చాయిస్. మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.74 లక్షలు. ఈ కారు తన కస్టమర్లకు కిలోగ్రాముకు 34 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని పేర్కొంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి
భారతీయ కస్టమర్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్జీ మోడల్ వినియోగదారులకు మంచి ఆప్షన్. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి తన కస్టమర్లకు కిలోగ్రాముకు 33.47 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని పేర్కొంది. భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.45 లక్షలు.
మారుతీ సుజుకి S-ప్రెస్సో సీఎన్జీ
మీరు కొత్త సీఎన్జీ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, మారుతి సుజుకి S-ప్రెస్సో సీఎన్జీ మోడల్ మంచి చాయిస్. మారుతి సుజుకి S-ప్రెస్సో సీఎన్జీ మోడల్ దాని వినియోగదారులకు కిలోగ్రాముకు 33 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని పేర్కొంది. అయితే ఈ కారు రూ. 5.92 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో భారత మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
మారుతీ స్విఫ్ట్ సీఎన్జీ
మారుతి సుజుకి స్విఫ్ట్ భారతీయ కస్టమర్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఇప్పుడు ఇటీవల, కంపెనీ మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ వేరియంట్‌ను భారత మార్కెట్లో రూ. 8.20 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ మోడల్ వినియోగదారులకు కిలోగ్రాముకు 32.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.