Samantha: సమంత పై మంత్రికి సంచలన వ్యాఖ్యలు.. ఏకమైన టాలీవుడ్!

2 Min Read

Samantha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ సినీ నటి సమంత గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈమె మాజీ మంత్రి కేటీఆర్ ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న క్రమంలో సమంత పేరును అలాగే అక్కినేని కుటుంబ ప్రస్తావన తీసుకురావడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఏకమై మంత్రి ఆరోపణలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఉండాలి అంటే సమంతను (Samantha)తన వద్దకు పంపించాలనీ కేటీఆర్ మాట్లాడారని ఈమె మీడియా సమావేశంలో మాట్లాడడంతో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అలాగే ఈయన డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా సినిమా సెలబ్రిటీలకు కూడా డ్రగ్స్ అలవాటు చేశారని సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ ఆరోపణలు చేశారు.

Also Read :https://teluguvaradhi.com/puri-jagannath-temple-ranta-bandar-survey-2024-details/

ఇక మంత్రి వ్యాఖ్యల పై నాగార్జున,నాగచైతన్య, సమంత ఘాటుగా స్పందించారు. మీ పాపులారిటీ కోసం మీ రాజకీయాల కోసం సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను ప్రస్తావనకు తీసుకురావద్దంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇక సమంత కోసం కేవలం అక్కినేని కుటుంబం మాత్రమే కాకుండా వెంకటేష్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ నాని చిరంజీవి వంటి వారందరూ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టడమే కాకుండా ఆమె క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఇలా చిత్ర పరిశ్రమ సమంత (Samantha)విషయంలో ఏకమై మంత్రి వ్యాఖ్యలను తప్పు పట్టడంతో తప్పనిసరి పరిస్థితులలో మంత్రి కొండ సురేఖ సమంతకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇక ఈ విషయంపై సమంత స్పందిస్తూ… మహిళలను వస్తువుల చూసే ఈ గ్లామర్ ప్రపంచంలో పనిచేయడానికి ప్రేమలో పడటం నిలబడి పోరాటం చేయడానికి చాలా శక్తి కావాలి. దయచేసి నా ఈ ప్రయాణాన్ని చిన్నచూపు చూడకండి. విడాకులనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ఇద్దర అంగీకారంతోనే అది జరిగింది. మీ రాజకీయాలకు నా పేరును దూరంగా పెట్టండి అంటూ ఈమె సుదీర్ఘమైన పోస్ట్ చేసారు.

Share This Article