Y.S Jagan : సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది.. ఇలా వైకాపా సోషల్ మీడియా యాక్టివిస్టులను అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు కూటమినేతలకు కొమ్ముకాస్తున్నారని పోలీసులకు కూడా తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అనుకూలంగా ఉన్న పోలీసులకు పోస్టింగ్స్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మరో నాలుగు సంవత్సరాలు పాటు మాత్రమే అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమేనని తెలిపారు. ఇప్పుడు అన్యాయంగా అందరిపై కేసులు పెట్టి వారిని హింసిస్తే ఆ తర్వాత మా ప్రభుత్వంలో వారు ఎక్కడున్నా పట్టుకొస్తామని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
Also Read : రూ.లక్ష కంటే తక్కువ ధరకే స్కూటర్లు, బైక్‌లు..
Y.S Jagan’s ‘Rayalaseema’ Warning: Tirupati SP Responds with Key Comments
కొంతమంది పోలీసులు మేము రిటైర్డ్ అయిపోతామని అనుకుంటారేమో రిటైర్డ్ అయిన తీసుకొస్తామని తెలిపారు. సప్త సముద్రాల వెనుక దాగి ఉన్న పట్టుకొస్తామని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇక తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గురించి కూడా జగన్ మాట్లాడారు. తెలంగాణకు చెందిన సుబ్బరాయుడు డిప్యూటేషన్ మీద తిరుపతి ఎస్పీగా వచ్చారు. ఆయన డిప్యూటేషన్ పూర్తి కాగానే తిరిగి తెలంగాణ వెళ్తానని అనుకుంటారేమో ఆయన తెలంగాణ వెళ్లిన ఇక్కడికి పిలిపిస్తానని జగన్ తెలిపారు.
ఇలా పోలీసులకు జగన్ మోహన్ రెడ్డి(Y.S Jagan) వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకించి తిరుపతి ఎస్పి సుబ్బరాయుడు గురించి ప్రస్తావనకు రావడంతో ఆయన జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ నాది కూడా రాయలసీమ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను నిర్వహించాల్సిన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నాను. నాపై నమ్మకంతోనే నన్ను తిరుపతి ఎస్పీగా నియమించారని సుబ్బరాయుడు తెలిపారు. తాను ఎవరికీ కొమ్ము కాయకుండా మంచి ఆశయంతోనే పనిచేస్తున్నాను. తన విధులను తాను సక్రమంగా నిర్వర్తిస్తున్న సమయంలో రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించారు. తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బరాయుడు రాయలసీమ అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిని తెలియజేశారు.