Pawan Kalyan : ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఇటీవల తిరుపతి లడ్డు విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు .తిరుపతి లడ్డులో నెయ్యికి బదులు జంతువుల నూనె ఉపయోగిస్తున్నారని చెప్పడంతో ఒక్కసారిగా ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చలకు కారణమైంది.
ఇలా తిరుపతి లడ్డు కల్తీ జరిగిందనే విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజులపాటు ఈ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. అయితే 11 రోజులు పూర్తి కావడంతో ఈయన నేడు ఉదయం తిరుమల స్వామి వారిని దర్శించుకుని దీక్ష విరమణ చేపట్టారు. ఇక పవన్ కళ్యాణ్ దీక్ష విరమించడం కోసం తిరుపతికి మెట్ల మార్గం గుండా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.
Also Read : Samantha: ఆ హీరో నాకు గురు సమానులు.. సమంత కామెంట్స్ వైరల్!
Pawan Kalyan’s Statement: ‘The Atonement Is Not for a Laddu!
నిన్న సాయంత్రం ఈయన మెట్ల మార్గం గుండా కొండపైకి బయలుదేరారు. ఇక పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్తున్న సమయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తిరుపతి లడ్డు విషయం గురించి పూర్తిగా యూటర్న్ తీసుకున్నారని చెప్పాలి. తాను తిరుపతి లడ్డు కల్తీ జరిగినందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయలేదని , శాశ్వత పరిష్కారం కోసం దీక్ష చేపట్టాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక కోర్టు విచారణలో భాగంగా లడ్డులో కల్తీ జరగలేదని కోర్టు కూడా చెప్పలేదు.విచారణ జరుగుతున్న సమయంలో తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే న్యాయమూర్తులు అలా చెప్పి ఉంటారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నెయ్యి కల్తీపై అందిన ల్యాబొరేటరీ నివేదికల్లో పొందుపరిచిన తేదీల్లో కొంత గందరగోళం ఉందని జడ్జీలు చెప్పారనీ ఈయన తెలియజేశారు. త్వరలోనే వీటిపై స్పష్టత ఇస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఇక గత ప్రభుత్వ హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయి ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశారు. మా ప్రభుత్వం వాటన్నింటిపై విచారణ చేపట్టిందని త్వరలోనే అన్ని లెక్కలు తేలుస్తాము అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.