KTR: తెలంగాణ తల్లడిల్లుతోంది.. తిరగబడుతోంది

KTR : రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన విమర్శలు చేశారు. ఇందులో భాగంగా.. వికారాబాద్ నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని ఫార్మా కంపెనీ అభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారులపై గ్రామస్తులు చేసిన దాడిని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. అంతేకాకుండా.. తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోందని .. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుందని అన్నారు. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుందని ప్రస్తావించారు. ఇక పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ గరమైతుందని వ్యాఖ్యానించారు.

అసమర్థ మూర్ఖపు ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులు ఇవి అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగబడుతున్నారని అన్నారు. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారని తెలిపారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్‌ల నిరసన తెలిపారని గుర్తుచేశారు. ఉపాధి దూరం చేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం అన్నారు. ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహా ధర్నా అన్నారు.

Also Read : KTR: సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం.. మంత్రి సురేఖ హాట్ కామెంట్స్!

KTR

గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై విద్యార్థి లోకం భగ్గుమంటోందన్ని తెలిపారు. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతల కన్నెర్ర అని తెలిపారు. కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి అని గుర్తుచేశారు. గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారని కేటీర్‌(KTR) ట్వీట్ వైరల్‌ గా మారింది.కేటీఆర్ చేసిన మరో ట్వీట్ కూడా వైరల్ అవుతుంది.. లగచర్ల గ్రామంలో అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపించి 28 మంది రైతులను అరెస్టు చేయించారని ట్వీటర్ వేదికగా మండిపడ్డారు.

వారందరిని రైతులు అనుకున్నారా లేక ఉగ్రవాదులు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీ భూ సేకరణ కోసం పచ్చని పంటలు పండే పొలాలను వల్లకాడు చేయొద్దన్నందుకు అరెస్టులా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా వెలుగులను తరిమి చీకట్లను నింపే ఇందిరమ్మ రాజ్యం అంటే అంటూ X వేదికగా కేటీఆర్ తెలంగాణ సర్కార్ పై మండిపడ్డారు. కేటీఆర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Share This Article