Tata Curvv vs Mahindra XUV : మహీంద్రా ప్రస్తుతం తన పోర్ట్‌ఫోలియో ఎక్స్ యూవీ400లో ఒక ఎలక్ట్రిక్ కారును మాత్రమే కలిగి ఉంది. ఈ కారణంగా కంపెనీ ఈ విభాగంలో చాలా వెనుకబడి ఉంది. అయితే, రాబోయే రోజుల్లో మహీంద్రా తన పోర్ట్‌ఫోలియోకు అనేక మోడళ్లను జోడించబోతోంది. వీటిలో ఒకదాని పేరు ఎక్స్ యూవీ.ఇ9.
రానున్న కొద్ది నెలల్లో XUV.e9ని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు మహీంద్రా ఎక్స్ యూవీ (Tata Curvv vs Mahindra XUV.e9)700 ఈ ఎలక్ట్రిక్ కూపే-ఎస్ యూవీ వెర్షన్ గురించి కొత్త వివరాలు వెలువడ్డాయి. ఇది భారత మార్కెట్లో టాటా కర్వ్ ఈవీతో పోటీ పడనుంది.
Also Read : Kia బంపర్ ఆఫర్.. ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ.15లక్షల తగ్గింపు..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 700కి.మీ.
Tata Curvv vs Mahindra XUV.e9: Which One to Choose for a 450km Range?
ఇది రియర్-వీల్-డ్రైవ్ (RWD) టెక్నాలజీతో మాత్రమే అందించబడుతుంది. అయితే ఆల్-వీల్-డ్రైవ్ (AWD) టెక్నాలజీని పొందే అవకాశాలు తక్కువ. కంపెనీ INGLO ప్లాట్‌ఫారమ్‌లో ది బెస్ట్ గా చెబుతున్నారు, ఈ రాబోయే మహీంద్రా XUV.e9 లోడింగ్ ఏరియాతో పాటు ఎక్కువ బూట్ స్పేస్‌తో రాబోతుంది. దీనిని ఏప్రిల్ 2025 నాటికి ప్రారంభించవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షల వరకు ఉండవచ్చు.
మహీంద్రా XUV.e9 పవర్‌ట్రెయిన్, డ్రైవింగ్ రేంజ్ గురించి మాట్లాడితే.. ఈ ఎలక్ట్రిక్ కారు మహీంద్రా BE.05 వలె అదే పవర్‌ట్రెయిన్‌ను పొందవచ్చు. అయితే ఇందులో ఆర్‌డబ్ల్యూడీ టెక్నాలజీని మాత్రమే ఉపయోగించనున్నారు. ఇది 80kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒకే మోటారును కలిగి ఉంటుందని అంచనా. ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 435కి.మీ నుండి 450కిమీ వరకు ప్రయాణించవచ్చు. ఎక్స్ యూవీ.ఇ9 ఎక్స్ టర్నల్ ఎలక్ట్రిక్ పార్టలకు ఎనర్జీని అందించడానికి వెహికల్-టు-లోడ్ (V2L) ఫంక్షన్‌ను అందించనున్నారు.
ఇప్పుడు దాని డిజైన్ గురించి మాట్లాడుకుంటే, మహీంద్రా XUV.e9 కూపే బాడీ స్టైల్, పెద్ద ఫాక్స్ గ్రిల్, హెడ్‌లైట్ క్లస్టర్‌తో XUV700కి భిన్నంగా కనిపిస్తుంది. ఇది ట్విన్-ఎడ్జ్డ్ బూమరాంగ్ ఆకారపు పెద్ద LED DRLలను కలిగి ఉంది. వెలుపలి భాగం పియానో నలుపు రంగు దీనికి ప్రీమియం రూపాన్ని ఇస్తుంది. ఎలక్ట్రిక్ కారు క్యాబిన్‌లో కొత్త 3-స్క్రీన్ డిస్‌ప్లే సెటప్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఇది 12.3-అంగుళాల యూనిట్‌తో పూర్తి HD (1920×720) డిస్‌ప్లే, లిక్విడ్ ఆప్టికల్‌గా క్లియర్ అడ్హెసివ్ (LOCA) బాండింగ్, ఒలియోఫోబిక్ (యాంటీ- స్మడ్జ్) కోటింగ్ తో రానుంది.