Tata Curvv: అక్టోబర్ 31లోపే టాటా కర్వ్ బుక్ చేసుకోండి..

3 Min Read

Tata Curvv: టాటా మోటార్స్ తన సరికొత్త కర్వ్ ఎస్‌యూవీ కూపేను రూ.9.99 లక్షల ప్రారంభ ధరకు విడుదల చేసింది. దీని టాప్ మోడల్ ధర రూ.19 లక్షలు. అయితే, ఇది ఈ 5-సీటర్ ఎస్ యూవీ ప్రారంభ ధర. ఈ ధరలు అక్టోబర్ 31, 2024 వరకు చేసుకున్న బుకింగ్‌లకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. దీన్ని బట్టి కంపెనీ తన ధరను నవంబర్ 1, 2024 నుండి మార్చుకోవచ్చని స్పష్టమైంది. ఒకవేళ మీరు దానిని కొనుగోలు చేయాలనుకుంటే అక్టోబర్ 31 లోపు బుక్ చేసుకోండి.

టాటా కర్వ్ ఫీచర్స్ : కర్వ్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అచీవ్డ్ అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. టాటా కర్వ్ కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్‌లో 11వ వెహికల్. టాటా మోటార్స్ కొత్త అట్లాస్ ప్లాట్‌ఫారమ్‌పై కర్వ్ నిర్మించబడింది. టాటా కర్వ్ (Tata Curvv) .. కర్వ్ ఈవీ నుండి వేరు చేస్తుంది. కర్వ్ ఇంజిన్‌లోకి చల్లని గాలిని పంపడానికి వెంట్‌లతో కూడిన ఫ్రంట్ గ్రిల్‌ ఉంటుంది. అయితే ఎయిర్ డ్యామ్ విభిన్నంగా రూపొందించబడింది. కర్వ్ ఈవీకి 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఫీచర్ల గురించి చెప్పాలంటే, టాటా కర్వ్‌లో (Tata Curvv) బ్యాక్‌లిట్ టాటా లోగోతో నాలుగు-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌ ఉంటాయి.

Tata Curvv Engine Features

టాటా కర్వ్ ఇంజిన్, ట్రాన్స్మిషన్ : టాటా మోటార్స్ కొత్త 1.2-లీటర్ GDi టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. దీనికి హైపెరియన్ అని పేరు పెట్టారు. ఇది కర్వ్‌తో అరంగేట్రం చేసింది. ఈ ఇంజన్ 124 బిహెచ్‌పి పవర్, 225 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ DCA ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఈ కొత్త ఇంజన్ క్రియేటివ్ ఎస్ ట్రిమ్ వేరియంట్ ధర రూ. 13.69 లక్షలతో అందించబడుతుంది.

టాటా కర్వ్ (Tata Curvv) QV వేరియంట్‌లో టర్బోచార్జ్డ్ 1.2-లీటర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 119 bhp శక్తిని, 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ DCA ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉన్న రెండు ఇంజిన్ ఎంపికలు ప్యాడిల్ షిఫ్టర్‌లను అందుకుంటాయి. గేర్‌బాక్స్ మాన్యువల్ నియంత్రణను అనుమతిస్తుంది.

Also Read : Warivo CRX EV: మార్కెట్లోకి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్… ఒక్క సారి ఛార్జింగ్ పెడితే 90కి.మీ

టాటా కర్వ్ 1.5-లీటర్ చిరోటెక్ డీజిల్ ఇంజన్ ఎంపికతో అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 117 bhp శక్తిని, 260 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా వస్తుంది. టాటా కర్వ్ డీజిల్ ఇంజన్‌తో డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పొందిన మొదటి ఎస్ యూవీ. డీజిల్ పవర్‌ట్రెయిన్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ వేరియంట్‌లలో ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

TAGGED:
Share This Article
Exit mobile version