Tarak: ముంబైలో అడుగుపెట్టిన తారక్… హృతిక్ రోషన్ తో యుద్ధానికి సిద్దం!

2 Min Read

Tarak: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే సగభాగం వరకు షూటింగ్ జరుపుకుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భాగమైన విషయం తెలిసినదే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్ గా కనిపించబోతున్నారని సమాచారం.

బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి ఎలాంటి వార్త బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా వార్ 2 గురించి అలాంటి న్యూస్ ఒకటి ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని తెలుస్తుంది. ఎన్టీఆర్ దేవర సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఎన్టీఆర్ లేకుండా ఉండే సన్నివేశాలు అన్నింటిని కూడా చిత్రీకరించారని తెలుస్తోంది.

Also Read : Ntr : ఎన్టీఆర్ గ్యారేజ్.. ఇచట ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇవ్వబడును!

ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదల కావడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ కాస్త ఫ్రీ కావడంతో ఈయన వార్ 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇప్పటికే ముంబైకి వెళ్లారని తెలుస్తుంది.నవంబర్ ఫస్ట్ వీక్లో క్లైమాక్స్ పోర్షన్ ఫైట్ సీన్ 20 రోజుల పాటు ఎన్టీఆర్ పాల్గొంటాడని తెలుస్తోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ క్లైమాక్స్ బ్లాక్‌ని డిజైన్ చేయడానికి YRFలో ప్రీ-ప్రొడక్షన్ భారీ స్థాయిలో స్కెచ్ వేస్తోంది. క్లైమాక్స్‌లో కొంత భాగం ముంబైలో షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లినటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Share This Article
Exit mobile version