Tamannah: తల్లి కావాలంటే వణికిపోతున్న తమన్నా.. కారణం ఇదేనట !

2 Min Read

Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు సినిమాల కంటే వెబ్ సిరీస్‌లు, ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టేస్తుంది. ఆమెకు అవకాశాలు తగ్గిపోవడంతో సౌత్ వదిలి నార్త్ పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో త‌మ‌న్నా నాకు తల్లి కావాలంటే భయమేస్తుందంటూ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే..

బ్యూటీ తమన్నా భాటియా బాలీవుడ్‌లో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కీ రాత్’ పాటతో సంచలనం సృష్టించింది. తన అందంతోనే కాదు, తన క్రేజీ డ్యాన్స్ మూమెంట్స్‌తో తమన్నా ఐటెం సాంగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతా బాగానే ఉంది కానీ 34 ఏళ్ల తమన్నా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. కాగా, తమన్నా పిల్లల గురించి తన అభిప్రాయాన్ని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది. తమన్నాకు పిల్లలంటే భయమట. ఓ ఇంటర్వ్యూలో తమన్నా తల్లి కావడానికి ఎందుకు భయపడిందో చెప్పింది. ఇటీవలి పాడ్‌కాస్ట్‌లో, తమన్నా మాట్లాడుతూ, ‘నేను తల్లి కావడానికి భయపడుతున్నాను. తల్లులు తమ పిల్లలకు అన్నీ ఇస్తారు. నేను నా పిల్లలకు ఇంత ప్రేమ, సంరక్షణ, పెంపకం ఇవ్వలేను. నా తల్లిదండ్రులు నాకు చాలా ప్రేమను ఇచ్చారు. వాటిని చూస్తుంటే పేరెంటింగ్‌లో డిగ్రీ చేసిన అనుభూతి కలుగుతుంది. అయితే ఇదంతా నేను చేయగలనని అనుకోవడం లేదు. పిల్లలు పుట్టాక ఏం జరుగుతుందోనని భయంగా ఉంది” అని చెప్పింది. తమన్నా నుండి ఊహించని ఈ వార్త విన్న తర్వాత, పెళ్లి తర్వాత కూడా తమన్నా తల్లి కాదా అనే ప్రశ్నలు అభిమానుల మదిలో తలెత్తాయి.

ఈ ఇంటర్వ్యూలో తమన్నా భాటియా పలు విషయాల గురించి మాట్లాడింది. ఇప్పటికీ వీడియో గేమ్‌లు ఆడటాన్ని ఇష్టపడే తమన్నా, తాను స్కూల్‌లో మంచి విద్యార్థినని, చదువుకు చాలా సమయం కేటాయించేదానినని చెప్పింది. తన చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటున్నారో పట్టించుకోనని తమన్నా చెప్పింది. మహిళలు ఆర్థికంగా దృఢంగా ఉండాలని తమన్నా అభిప్రాయపడ్డారు. ఆడవాళ్లు అన్నీ చేయగలరని చెప్పింది. “ఇతరులు ఏమనుకుంటున్నారో మర్చిపోండి. మొదట మీకు ఏమి కావాలో మీరే నిర్ణయించుకోండి” అంటూ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ పీకింది. బంధం బలపడాలంటే ఏం చేయాలి?అనే ప్రశ్నకు తమన్నా సమాధానంగా..‘‘మీ పార్ట్‌నర్ చెప్పేది ప్రశాంతంగా వినండి.. అయితే మీ పోరాటానికి నేను అండగా ఉంటాను’’ అంటూ తన అభిమానులకు ప్రేమ పాఠాలు చెప్పింది. కాగా, తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. ఇద్దరికీ మంచి అనుబంధం ఏర్పడింది. తమన్నా భాటియా, విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

Share This Article
Exit mobile version