Suriya : ఆరు వేలమంది పిల్లల చదువులకు సాయం… ఆయన స్ఫూర్తితోనే అంటున్న సూర్య?

2 Min Read

Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సూర్య గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈయన వైజాగ్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరోల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సూర్య(Suriya) తెలుగు హీరోల గురించి మాట్లాడుతూ నాకు నేషనల్ అవార్డు వచ్చిన సమయంలో చాలామంది హీరోలు తనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేసి నాకు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : చైతన్యతో విడాకులు.. Samantha ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు.. ఫోటోలు వైరల్!

Suriya

ఆయన ఫోన్ చేయడమే కాకుండా నన్ను పర్సనల్ గా ఇంటికి ఆహ్వానించి ఆయన చేతితో చేసిన ఫిష్ కర్రీ అలాగే దోస పెట్టారు. ఇక ఇటీవల చిరంజీవి గారిని కలిసినప్పుడు కంగువ సినిమా గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. నేను చెన్నైలో ఇల్లు కట్టుకోవడం ఎన్జీవో సంస్థను నడుపుతున్నాను అంటే అందుకు కారణం చిరంజీవి గారని సూర్య తెలిపారు.

ఆయన నుంచి నేను ఎంతో స్ఫూర్తిని పొందగలిగాను ఆస్ఫూర్తితోనే సుమారు 6000 మంది విద్యార్థుల చదువులకు సహాయం చేయగలిగాను అంటూ ఈ సందర్భంగా సూర్య చిరంజీవి గురించి ఆయన నుంచి స్ఫూర్తి పొందిన విధానం గురించి చేసిన కామెంట్స్ మెగా అభిమానులను సంతోష పెడుతున్నాయి. ఇక రామ్ చరణ్ 15 సినిమాలకే గ్లోబల్ స్టార్ అయ్యారని పవన్ కళ్యాణ్ రియల్, రీల్ లైఫ్ లో ఒకే విధంగా ఉంటారని తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి అంతే అంటూ చెప్పుకోవచ్చు. మహేష్ బాబు గురించి మాట్లాడుతూ మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాము మహేష్ నా కంటే కూడా జూనియర్ ఇక మహేష్ ఆటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం అని తెలిపారు. అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టం ఆ డాన్స్ కు నేను అభిమానిని పుష్ప2 కోసం నేను ఎంతో ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతారని అతనిలా ఎవరు తెలుగు మాట్లాడలేరు అంటూ టాలీవుడ్ హీరోల గురించి సూర్య ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Share This Article