Surya : అమ్మ అప్పు తీర్చడానికే హీరో అయ్యాను… సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

2 Min Read

Surya : సూర్య  పరిచయం అవసరం లేని పేరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న సూర్య తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన నటించిన గజిని సినిమా తెలుగులో విడుదల అయింది. ఈ సినిమాకు తెలుగులో ఎంతో మంచి క్రేజ్ రావడమే కాకుండా సూర్యకు భారీ స్థాయిలో అభిమానులు కూడా పెరిగిపోయారు..

గజినీ సినిమా తర్వాత సూర్య(Surya) నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా తెలుగులో డబ్ అయ్యి విడుదలవుతుంది. తమిళ చిత్ర పరిశ్రమలో సూర్యకు ఏ స్థాయిలో అయితే అభిమానులు ఉన్నారో తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. సూర్య (Surya)సినిమా విడుదల అవుతుంది అంటే చాలు పెద్ద ఎత్తున థియేటర్లను ముస్తాబు చేస్తారు. అలాగే ఆయన పుట్టినరోజు వేడుకలను కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటారు.

Also Read : Pawan Kalyan Daughter : తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ చిన్న కుమార్తె పలీనా.. ఫోటోలు వైరల్!

ఇకపోతే త్వరలోనే సూర్య నటిస్తున్న కంగువ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సూర్య పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఇండస్ట్రీలోకి రావడం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన తండ్రి ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగిన తనకు మాత్రం సినిమాలంటే ఆసక్తి ఉండేది కాదని సూర్య తెలిపారు.

తాను ఏదైనా ఓ కంపెనీ పెట్టుకోవాలని నాన్న పెట్టుబడికి సహాయం చేస్తే వ్యాపార రంగంలోకి వెళ్లాలనుకున్నాను అయితే నాన్న ఒకానొక సమయంలో సినిమా అవకాశాలను కోల్పోయారు. ఆ సమయంలో నేను డిగ్రీ చదువుతూ ఉండేవాడిని. అప్పుడు తాను ఒక బట్టల దుకాణంలో నెలకు 300 రూపాయల జీతంతో పని చేశానని సూర్య తెలిపారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అమ్మ నాన్నకు తెలియకుండా 25 వేల రూపాయలు అప్పు చేసింది.

ఈ అప్పు సంగతి అమ్మ నాతో చెప్పడంతో ఒకసారిగా షాక్ అయ్యాను. ఇకపోతే నాన్న సినిమా ఇండస్ట్రీకి దూరం కావడంతో మణిరత్నం గారు తన సినిమాలో నన్ను తీసుకోవడం గురించి నాన్నతో మాట్లాడటానికి ఇంటికి వచ్చారు. నాకైతే ఆ సినిమాలలోకి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు.. మణిరత్నం గారు బలవంతం చేశారు. ఆ సమయంలోనే అమ్మ చేసిన అప్పు కూడా గుర్తుకు వచ్చింది. ఇక మణిరత్నం గారు బలవంతం చేయడంతో నెరుక్కుర్ నేర్ అనే సినిమాలో సెకండ్ హీరోగా చేశాను. ఫస్ట్ హీరోగా విజయ్ సినిమా చేశారు.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో నాకు సినిమాలపై ఆసక్తి వచ్చింది. అలాగే ఈ సినిమా ద్వారా తీసుకున్న రెమ్యూనరేషన్ తో అమ్మ చేసిన అప్పు మొత్తం తీర్చేశాను. ఇలా అమ్మ చేసిన అప్పు తీర్చడం కోసమే నేను సినిమాలలోకి వచ్చానని ఈ సందర్భంగా సూర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Share This Article
Exit mobile version