KTR: సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం.. మంత్రి సురేఖ హాట్ కామెంట్స్!

2 Min Read

KTR : తెలంగాణ మంత్రి కొండ సురేఖ మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కేటీఆర్ కారణమని తెలిపారు. కేటీఆర్ వల్ల ఎంతో మంది స్టార్ హీరోయిన్ చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారని ఈమె తెలిపారు.

కేటీఆర్(KTR) డ్రగ్స్ కి అలవాటు పడటమే కాకుండా సెలబ్రిటీలకు కూడా డ్రగ్స్ అలవాటు చేశారని సురేఖ వ్యాఖ్యానించారు. ఇలా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు డ్రగ్స్ అలవాటు చేసిన ఈయన రేవ్ పార్టీలను నిర్వహించి వారిని ఆ పార్టీలకు రప్పించి వారి పర్సనల్ వీడియోల ద్వారా బ్లాక్ మెయిల్ చేసే వారని తెలిపారు. ఈ విధంగా నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమని ఈ విషయం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు అంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.

Also Read : Jani Master : ఒక్క పాటకు జానీ మాస్టర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. కెరియర్ నాశనం చేసుకున్నారా?

Surekha comments on ktr

మరి కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మూడు సంవత్సరాల పాటు ఎంతో సంతోషంగా సాగిపోయిన వీరిద్దరూ ఒక్కసారిగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరగడమే కాకుండా ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. వీరి విడాకులకు కారణం ఏంటి అనేది తెలియదు కానీ వీరిద్దరూ విడిపోవడంతో అభిమానులు అప్పట్లో ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సమంత నుంచి విడాకులు తీసుకున్న నాగచైతన్య తిరిగి శోభిత ప్రేమలో పడ్డారు. ఇప్పటికే వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ ఏడాది చివరిన లేదా వచ్చే ఏడాది మొదట్లో వివాహం చేసుకోబోతున్నారు.నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమైనప్పటికీ సమంత మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉంటూ కెరియర్ పైన పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.

Share This Article