Sri Reddy : సంచలన తార శ్రీ రెడ్డి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమెను సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ చేసినప్పటికీ సినిమా ఇండస్ట్రీ గురించి రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈమె అధికార పార్టీకి మద్దతుగా నిలిచి ప్రత్యర్థులపై ఇష్టానుసారంగా బూతు పదాలతో చెలరేగిపోయారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ గురించి తమ కుటుంబాల గురించి ఎవరైతే అభ్యంతరకరంగా, అసభ్యకర పదజాలం ఉపయోగించి మాట్లాడారో అలాంటి వారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే నటి శ్రీ రెడ్డి (Sri Reddy) పై కూడా ఫిర్యాదులు రావడంతో ఏ క్షణమైనా శ్రీ రెడ్డి అరెస్టు కావడం తథ్యమని తెలుస్తుంది. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి బహిరంగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు.
Also Read : KTR: రైతులంటే ఉగ్రవాదులు అనుకున్నారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం
Sri Reddy’s Apology to Jagan and Lokesh: Is the Pressure Mounting?
ఇలా ఈమె క్షమాపణలు చెప్పినప్పటికీ తనపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు టీడీపీ మహిళ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే తాజాగా శ్రీ రెడ్డి మరోసారి ఓ బహిరంగ లేఖను విడుదల చేస్తూ జగనన్నకు క్షమాపణలు చెప్పారు. కేవలం ప్రత్యర్థుల గురించి నేను మాట్లాడిన ఆసభ్యకరమైన పదజాలం కారణంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. ఇకపై పార్టీ కార్యకలాపాలకు తాను దూరంగా ఉంటాను. ఈ విషయంలో నన్ను క్షమించు జగనన్న అంటూ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు అలాగే లోకేష్ కి కూడ సారీ చెప్పారు.
చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను అసభ్యకరంగా మాట్లాడుతూ తప్పు చేశాను నన్ను క్షమించండి. నన్ను, నా కుటుంబాన్ని కాపాడాలి అంటూ ఈమె కోరారు. ఇప్పటికే శ్రీ రెడ్డి పై రాజమండ్రి అనకాపల్లి విజయవాడ వంటి ప్రాంతాలలో కేసులు నమోదు అయిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె క్షమాపణలు చెబుతూ వీడియోలు చేసినా, బహిరంగ లేఖలు రాసినప్పటికీ ఈమె గతంలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని తనని అరెస్టు చేయాలని పలువురు డిమాండ్లు చేస్తున్నారు. మరి శ్రీరెడ్డి విషయంలో అధికార పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.