Sobhita: పెళ్లి కాకుండానే నాగార్జునకు కోపం తెప్పించిన శోభిత… ఏమైందంటే?

2 Min Read

Sobhita: సినీనటి శోభిత ధూళిపాళ్ల రహస్యంగా నాగచైతన్యతో రిలేషన్ లో ఉంటూ వచ్చారు. ఇలా వీరిద్దరూ ఇలా సీక్రెట్ గా తమ రిలేషన్ కొనసాగిస్తూ ఇటీవల నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఆగస్టు నెలలో నాగచైతన్య శోభిత నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇక వీరికి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాల గురించి ఇప్పటివరకు సరైన స్పష్టత మాత్రం రాలేదు. ఇకపోతే నటి శోభిత మాత్రం తన పెళ్లి వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

వీరి పెళ్లి ఎప్పుడనే విషయాలను తెలియ చేయకపోయినా శోభిత మాత్రం తన పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తుంది. శోభిత(Sobhita) వైజాగ్ లోని తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంప్రదాయ బద్ధంగా పసుపు దంచే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శోభిత చాలా పద్ధతిగా చీర కట్టుకొని మట్టి గాజులు చంద్రహారం ధరించి తెలుగుతనం ఉట్టిపడేలా కనిపించారు.

Also Read :https://teluguvaradhi.com/sobhita-on-getting-engaged-to-naga-chaitanya/

ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో శోభిత కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ చీర గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చీర కట్టుకొని శోభిత పెళ్లి కాకుండానే తన మామయ్య నాగార్జునకు కోపం తెప్పించారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. నిజానికి ఈ చీర శోభితది కాదట. ఈ చీర నాగచైతన్య తల్లి లక్ష్మీదని కామెంట్ రూపంలో తెలియజేశారు దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున నుంచి కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న లక్ష్మి చీర కట్టుకుని శోభిత (Sobhita)పూజలు చేయడం పట్ల నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. తన కొడుకు పెళ్లి సందర్భంగా లక్ష్మి తన చీర నగలను తనకు కాబోయే కోడలకు ఇచ్చారని తెలుస్తుంది. గతంలో కూడా నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకునే సమయంలో దగ్గుబాటి లక్ష్మి తన తల్లి పెళ్లి చీరను అలాగే నగలను సమంతకు ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా సమంత శోభిత వివాహం గురించి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇక వీరి వివాహం ఎప్పుడు ఎక్కడ అనే విషయాల గురించి ఎలాంటి సమాచారం లేదు. అందుతున్న సమాచారం ప్రకారం వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ జరగబోతుందని తెలుస్తోంది.

Share This Article
Exit mobile version