Sobhita: శోభిత ధూళిపాళ్ల పరిచయం అవసరం లేని పేరు. తెలుగు అమ్మాయి అయినా ఈమె బాలీవుడ్ సినిమాల ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న శోభిత త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. నటుడు నాగచైతన్యతో ఈమె నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే ఈమె నాగచైతన్యతో ఏడడుగులు నడిచే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న సంగతి తెలిసిందే.
ఇక నాగ చైతన్యతో నిశ్చితార్థం అయిన తర్వాత శోభిత(Sobhita) సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కెరియర్ మొదట్లో ఈమె ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. తాను డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టినట్లు శోభిత(Sobhita) తెలిపారు.. ఇలా మోడల్ గా కెరియర్ ప్రారంభించిన సమయంలో చాలామంది తన కలర్ గురించి హేళన చేస్తూ మాట్లాడారని తెలిపారు.
Also Read :Ratan Tata: రతన్ టాటాకు నివాళులు అర్పించిన టాలీవుడ్ స్టార్స్!
Sobhita Opens Up About Early Career Humiliations: “You’re Not Even Good for That”
షాంపూ యాడ్ చేయడానికి ఆడిషన్‌కి వెళితే ఇంత నల్లగా ఉన్నావు నువ్వు మోడల్ కావడం ఏంటి కనీసం బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అంటూ హేళన చేశారు. ఆ సమయంలో బాగా ఏడ్చానని తెలిపారు.నెమ్మదిగా తన ఆలోచనల నుంచి బయటపడ్డాననీ, అందం అనేది ఎదుటి వారి ఆలోచనలకు సంబంధించినది. కాబట్టి, ఎవరు ఏమనుకుంటున్నారనే ఆలోచన మానేశానని అన్నారు. తన పని తాను చేసుకుంటూ పోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఇక నా స్నేహితులు కూడా నాకు చాలా ప్రోత్సాహం కల్పించారని శోభిత తెలిపారు.
అలా ఆడిషన్ కి వెళ్తూ సినిమా అవకాశాలను అందుకున్నానని అయితే తనకు సినిమా అవకాశం వచ్చిన తర్వాత ఏ షాంపూ బ్రాండ్ అయితే నన్ను అవమానించిందో అదే షాంపూ బ్రాండ్ తన సంస్థలకు నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరారు అంటూ ఈ సందర్భంగా శోభిత తన కెరియర్ మొదట్లో ఎదురైన అనుభవాలను తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.