Kiran Abbavaram : చాలా రోజుల తర్వాత కంటి నిండా నిద్రపోయాను

2 Min Read

Kiran Abbavaram : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా క అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుజీత్‌ – సందీప్‌ సంయుక్త దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో నుంచి మంచి టాక్ సొంతం చేసుకోవడంతో హీరో కిరణ్ అబ్బవరం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్న. ఈ దీపావళిని నాకు మరింత సంతోషకరమైన రోజుగా మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. హ్యాపీ దీపావళి అంటూ ఈయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Also Read : Susmitha : చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత హీరోయిన్గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా?

Kiran Abbavaram

ఇక ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఎన్నో సినిమాలలో నటించారు కానీ ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు ఇంకా ఈ సినిమా తన కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈయన కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా విషయంలో కిరణ్ అబ్బవరంకు భారీ స్థాయిలో ఇతర హీరోల నుంచి సపోర్ట్ లభించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈయన తన గురించి వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. కొందరు కావాలనే నన్ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారని చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడుతూ నేను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు.

ఇలా నన్ను ఉదేశపూర్వకంగా ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా చూడండి ఈ సినిమా కనుక మీకు నచ్చకపోతే నేను సినిమాలు కూడా చేయను అంటూ ఈయన తెలియజేశారు. ఈ విధంగా కిరణ్ అబ్బవరంకి మంచి మద్దతు లభించడమే కాకుండా సినిమా కూడా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Exit mobile version