SIIMA Awards 2024 : సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024.. దక్షిణాది సినీ సెలబ్రిటీలు ఎంతగానో ఎదురుచూస్తున్న సైమా అవార్డ్స్ వేడుక వచ్చేసింది. సెప్టెంబరు 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు దుబాయ్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో గత ఏడాది సౌత్‌లో విడుదలై మంచి ఆదరణ పొంది, ఉత్తమ చిత్రాలుగా ప్రజల మన్ననలు అందుకున్న చిత్రాలకు సైమా అవార్డ్స్ ప్రకటించడమే కాకుండా.. ఆ సినిమాల్లో అత్యుత్తమ నటనను కనబరిచిన నటీనటులను ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ ఉత్తమ నటుడు, ఉత్తమ కథానాయిక వంటి పలు విభాగాల్లో విజేతలుగా నిలిచిన పలువురు అవార్డులు అందుకున్నారు. సైమా 2024 తెలుగు అవార్డ్స్ విజేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఉత్తమ చిత్రం – బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి.
ఉత్తమ నటుడు – నేచురల్ స్టార్ నాని (దసరా)
ఉత్తమ దర్శకుడు – శ్రీకాంత్ ఓదెల (దసరా)
ఉత్తమ సహాయ పాత్ర (పురుషుడు) – దీక్షిత్ శెట్టి (దసరా)
ఉత్తమ హీరోయిన్ – కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – సాయి రాజేష్ (బేబీ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- ఆనంద్ దేవరకొండ (బేబీ)
బెస్ట్ డెబ్యూ హీరోయిన్ – వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ గీత రచయిత – అనంత్ శ్రీరామ్ (ఓ టూ లవ్స్ – బేబీ)
ఉత్తమ డెబ్యూ యాక్టర్ – సంగీత్ శోభన్ (మ్యాడ్)
ఉత్తమ హాస్యనటుడు – విష్ణు ఓయ్ (మ్యాడ్)
ఉత్తమ హీరోయిన్ (క్రిటిక్స్) – మృణాల్ ఠాకూర్ (హాయ్ డాడ్)
ఉత్తమ డెబ్యూ డెరెక్టర్ – శౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ సహాయ పాత్ర (మహిళ) – బేబీ ఖియారా ఖన్నా (హాయ్ నాన్న)
ఉత్తమ తొలి నిర్మాత – వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ (హాయ్ నాన్న)
ఉత్తమ సంగీత దర్శకుడు – హేషమ్ అబ్దుల్ వహాబ్ (హాయ్ నాన్న, ఖుషీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – భువన గౌడ (సలార్)
ఉత్తమ గాయకుడు (పురుషుడు) – రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు – బలగం)
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ – దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
వీరంతా తెలుగు సినిమాల్లో కూడా నటించి తమ అద్భుతమైన నటనకు సైమా అవార్డ్‌ని సొంతం చేసుకున్నారు.
దుబాయ్‌లో జరిగిన ఈ కార్యక్రయంలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా వేదికపై డ్యాన్స్ చేసి ప్రముఖులను అలరించారు. వీరితో పాటు ప్రముఖ పాన్ ఇండియా హీరోయిన్ శ్రేయ సరన్ కూడా తన అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించింది. సాన్వీ కూడా డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఏది ఏమైనా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సైమా అవార్డ్స్ వేడుక దుబాయ్ లో జరుగుతోంది. తమ అభిమాన నటులకు అవార్డులు రావడం పట్ల అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.