Shruthi Marathe : సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది కొత్తవాళ్లు వస్తుంటారు పాత వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు. ఇలా టాలెంట్ ఉన్నటువంటి సెలెబ్రిటీలు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగుతూ ఉంటారు. అయితే వారు నటించిన ఒక్క సినిమా అయినా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వాటిలో దేవర సినిమాలో ఎన్టీఆర్ కి భార్యగా నటించిన నటి శృతి మరాఠే ఒకరు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కొడుకు పాత్రలో నటించిన ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా తండ్రి పాత్రలో నటించిన ఎన్టీఆర్ సరసన శృతి నటించారు.. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత హీరోయిన్ జాన్వీ కపూర్ కంటే కూడా శృతి(Shruthi Marathe) గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.
Also Read :Devara: దేవర ఒక్క ఫైట్ కోసం పది కోట్లు… తేడా కొట్టిందో అంతే సంగతులు!
Shruthi Marathe: Do You Know the Actress Who Played NTR’s Wife in Devara?
ఎన్టీఆర్ భార్య పాత్రలో నటించిన ఈమె ఎవరు తన సినీ బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలు గురించి అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈమె జన్మించింది గుజరాత్ లో అయినప్పటికీ నటిగా మరాఠీలోనే మొదటిగా పరిచయం అయ్యారు. ఈమె మోడల్ గా కూడా వర్క్ చేసిందట. అంతే కాకుండా ఈమెకి సౌత్ లో దేవర మొదటి సినిమా కాదనీ, ఆల్రెడీ తమిళ్ లో పలు చిత్రాలు ఈమె చేసింది. ఇందిరావిజి, గురు శిష్యన్, అరవన్, నాంగ రొంబ బిజీ అనే చిత్రాల్లో ఈమె ఆల్రెడీ సౌత్ లో పలు చిత్రాల్లో నటించింది.
ఇలా పలు తమిళ సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇలా తమిళ సినిమాలలో నటించిన శృతి కొరటాల కంట్లో పడటంతో ఈమెకు దేవర సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే దేవర సినిమా మాత్రం తనకు మంచి పేరును తీసుకువచ్చిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న శృతికి ముందు ముందు తెలుగులో భారీ స్థాయిలో అవకాశాలు కూడా వస్తాయి అనడంలో సందేహం లేదని చెప్పాలి.