Sekhar Basha: అరెస్ట్ వార్తలపై స్పందించిన శేఖర్ భాష.. అసలు నిజం ఇదేనంటూ?

2 Min Read

Sekhar Basha : ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి విషయంలో శేఖర్ బాషా బాధితురాలకు వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఇలా తన గురించి శేఖర్ భాష వ్యతిరేకంగా మాట్లాడటంతో సదరు బాధిత మహిళల పోలీసులకు ఫిర్యాదు చేసింది తద్వారా పోలీసులు శుక్రవారం సాయంత్రం శేఖర్ భాషను అరెస్ట్ చేసి దాదాపు మూడు గంటల పాటు విచారణ చేసిన అనంతరం తనని వదిలి పెట్టారని అలాగే తాను చేసిన కామెంట్లకు వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులు తెలిపినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇలా శేఖర్ భాష(Sekhar Basha) అరెస్టు కావడంతో ఒక్కసారిగా ఈ వార్తలు వైరల్ అయ్యాయి అయితే ఈయన అరెస్టు గురించి విభిన్న రకాలుగా వస్తున్న వార్తలపై శేఖర్ భాష స్పందించి తాను అరెస్ట్ అవడం వెనుక ఉన్న కారణం ఏంటి అసలు నిజం ఏంటనే విషయాలను వెల్లడించారు. ఈయన రిలీజ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ… నేను అరెస్టు అయ్యాను అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.

Also Read : Bigg Boss House Rules : మారిన రూల్…ఇది గమనించారా?

అసలు నన్ను పోలీసులు ఎవరు అరెస్టు చేయలేదని ఈయన క్లారిటీ ఇచ్చారు..ప్రో కబడ్డీ లీగ్ చూసేందుకు గచ్చి బౌలి మైదానానికి వెళ్లాను. అందుకే నా ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయింది. అందుకే ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాను. సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ రూమర్లే. ఎవరూ ఆ వార్తలను నమ్మొద్దు అంటూ ఈ సందర్భంగా ఈ నొక వీడియోని విడుదల చేశారు.

ఇలా శేఖర్ భాష వీడియోని విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో శేఖర్ బాషా వరుస వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం నటుడు రాజ్ తరుణ్ లావణ్య విషయంలో కూడా ఈయన ఇన్వాల్వ్ అవ్వడంతో లావణ్య ఏకంగా ఈయనపై చెప్పుతో దాడి చేసిన సంగతి తెలిసిందే ఇక ఈ ఘటన మర్చిపోకముందే మరోసారి హర్ష సాయి విషయంలో ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Share This Article
Exit mobile version