Sreeleela: అల్లు అర్జున్ కి అదిరిపోయే గిఫ్ట్ పంపిన శ్రీలీల… ఏంటో తెలుసా?

Sreeleela : పెళ్లి సంద సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి శ్రీ లీల. ఈమె తన మొదటి సినిమాతోనే తన నటన అందచందాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా మొదటి సినిమాతో పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా ఈమె తదుపరి రవితేజ తో హీరోగా సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా రవితేజ శ్రీ లీల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి

ఇలా ఒకేసారి అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకున్న శ్రీ లీల (Sreeleela) ఏ సినిమా ద్వారా అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. బాలకృష్ణతో కలిసిన నటించిన భగవంత్ కేసరి సినిమా మాత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణకి కూతురి పాత్రలో శ్రీలీల నటించారు. ఇక ఈమె చివరిగా తెలుగులో గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తరువాత శ్రీ లీలకు కూడా తెలుగులో కొద్దిపాటి అవకాశాలు తగ్గాయని చెప్పాలి.

Also Read : Allu Arjun: త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ పై బిగ్ అప్డేట్.. రాజమౌళి సినిమాలో కూడా ఉండవంటూ?

Sreeleela

ఇదిలా ఉండగా త్వరలోనే ఈమె హీరో నితిన్ తో కలిసి నటించిన రాబిన్ హుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. అంతకంటే ముందుగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో ఈమె స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తుంది.

అల్లు అర్జున్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు తోడు అదే రేంజ్ లో డాన్స్ వేసే శ్రీ లీల తోడైతే వారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇక శ్రీ లీల పెర్ఫార్మెన్స్ కు బన్నీ ఏకంగా డాన్సింగ్ క్వీన్ అంటూ ఆమెకు బిరుదు కూడా ఇచ్చేశారు. ఇలా ఈ పాట షూటింగ్ పూర్తి అయిన వెంటనే శ్రీ లీల (Sreeleela) ప్రత్యేకంగా అల్లు అర్జున్ కోసం అలాగే తన భార్య స్నేహారెడ్డి పిల్లల కోసం స్పెషల్ గిఫ్ట్స్ పంపినట్టు తెలుస్తోంది.

ఈ విధంగా శ్రీ లీల పంపిన ఈ కానుకలను అల్లు అర్జున్ అలాగే స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా శ్రీ లీల పంపిన గిఫ్ట్స్ చూసిన బన్నీ నువ్వు రాసిన లెటర్ లో నా మనసుని తాకింది. నీ ప్రేమకి నా కృతజ్ఞతలు అంటూ షేర్ చేశారు. స్నేహా రెడ్డి ఆతిధ్యానికి శ్రీలీల థాంక్స్ చెప్పింది. తనని అద్భుతంగా ఆదరించిన ఫ్యామిలీ మొత్తానికి శ్రీలీల థాంక్స్ చెబుతూ లెటర్ రాసారు. ఇక పుష్ప 2 సినిమా కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని ఈమె తెలిపారు.

Share This Article
Exit mobile version