Sobitha : సమంత నా సోల్ మేట్… ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు

2 Min Read

Sobitha : సినీనటి శోభిత ధూళిపాళ్ల ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ సినిమాల ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు అలాగే హాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న శోభిత సినీ నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభిత(Sobitha) ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇలా నిశ్చితార్థం తర్వాత శోభిత ఒక్కసారిగా ఎంతో పాపులర్ అవ్వడమేకాకుండా తరచూ సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

Also Read : Nagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత వెడ్డింగ్ డేట్ ఫిక్స్.. పెళ్లి ఎప్పుడు ఎక్కడంటే?

తాజాగా శోభిత ధూళిపాళ్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శోభిత తన ఇష్టాలు, చైతుతో లవ్ గురించి పంచుకుంది. అలాగే.. సమంతపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. తాను తెనాలిలో పుట్టినప్పటికీ నాన్న వైజాగ్ పోర్ట్ లో పనిచేస్తున్న తరుణంలో ఇక్కడే పెరిగానని తెలిపారు. ఇక అమ్మ టీచర్ కావడంతో నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారిపోయిందని శోభిత తెలిపారు. ఇక నేను మొదట చదివిన పుస్తకం బుడుగు అంటూ ఈమె పలు విషయాలను వెల్లడించారు.డిగ్రీ ముంబాయిలో చేశాననీ, ఆ సమయంలో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నాననీ, మోడలింగ్‌ చేయడం స్టార్ట్ చేశానన్నారు.

ఇక తన సోదరి సమంత గురించి కూడా ఈమె పలు విషయాలు తెలిపారు. ఆమె నా సోల్ మేట్ అంటూ చెప్పుకు వచ్చారు. సమంతకు పెళ్లైందనీ, సినిమాలు, షూటింగ్స్ లో బిజీగా ఉండడడంతో తాను కుటుంబానికీ, బంధువులకీ చాలా కాలంగా దూరంగా ఉండాల్సి వస్తుందన్నారని బాధపడ్డారు. కానీ తన చెల్లి పెళ్లిలో మాత్రం బంధువులను స్నేహితులందరినీ కలుసుకున్నానని చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు.

ఇక సమంత పెళ్లిలో అందంగా ముస్తాబైన తన చెల్లి సమంతను చూసినప్పుడు మాత్రం కళ్లలో నీళ్లు తిరిగాయని, తన జీవితంలోని బెస్ట్‌ మూమెంట్స్‌లో అదీ ఒకటి అని ఎమోషనల్ అయ్యారు. ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ నాగచైతన్య చాలా మంచివాడు, మర్యాదస్తుడు. నాతో చాలా హుందాగా ఉంటారని ఆయన ఎప్పుడూ చాలా కూల్ గా ఉంటారని తెలిపారు. అదే విషయమే నన్ను చైతన్య ప్రేమలో పడేలా చేసింది అంటూ శోభిత తెలిపారు.

Share This Article
Exit mobile version