Ntr: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్…మామూలు ప్లానింగ్ కాదుగా?

2 Min Read

Ntr : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేయబోతున్నారనే ఆతృత ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. కానీ ఈయన దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులకు కావలసిన ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. నిజానికి రాజమౌళి డైరెక్షన్లో చేసిన హీరోలు తదుపరి ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటారు అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది.

ఇలాంటి సెంటిమెంట్ క్రియేట్ చేసినది ఎన్టీఆర్(Ntr) అలాగే ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసినది కూడా ఎన్టీఆర్ అనే చెప్పాలి. ప్రస్తుతం దేవర సినిమా అద్భుతమైన కలెక్షన్లను సాధించి ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో తదుపరి సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అతి తొందరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది.

Also Read :Devara : దేవర సినిమాని చుట్టుముడుతున్న బ్యాడ్ సెంటిమెంట్స్… సెంటిమెంట్లను బ్రేక్ చేసేనా?

ఇప్పటికే ఎంతో ఘనంగా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివరన రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్(Ntr) కు జోడిగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఒక అద్భుతమైన స్పెషల్ సాంగ్ కూడా ఉండేలాగా ప్రశాంత్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఈ స్పెషల్ సాంగ్ కోసం మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను సంప్రదించారని తెలుస్తుంది. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరనే విషయానికొస్తే ఆమె మరేవరో కాదు టాలీవుడ్ స్టార్ నటి సమంత అని తెలుస్తుంది. సమంత ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. అలాగే ఈమె ఇది వరకే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ తో ఏకంగా నాలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించి సమంత మెప్పించారు. ఎన్టీఆర్ సమంత కాంబినేషన్లో రభస, జనతా గ్యారేజ్, రామయ్య వస్తావయ్య, బృందావనం వంటి సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

TAGGED:
Share This Article
Exit mobile version